Begin typing your search above and press return to search.
హృతిక్ ..రణవీర్ మధ్య వార్ తప్పదా?
By: Tupaki Desk | 27 Sep 2022 6:35 AM GMT'బ్రహ్మాస్ర్త' మొదటి భాగం సక్సెస్ అయినా? కాకపోయినా? రెండవ భాగం మాత్రం కచ్చితంగా తీసి తీరుతామని మొదటి భాగం రిలీజ్ కి ముందు దర్శకుడు ఆయాన్ ముఖర్జీ ప్రకటించారు. ఆ సినిమా సక్సెస్ తో మాకెలాంటి సంబంధం లేదు. రెండవ భాగం మాత్రం తెరకెక్కడం ఖాయ అన్న ఎంతో కాన్పిడెం ట్ గా చెప్పారు. ఇప్పుడా మాటను ఆయాన్ నిలబెట్టుకుంటున్నారు.
మొదటి భాగానికి 400 కోట్లు బడ్జెట్ కేటాయించి నిర్మించినా..బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల నష్టం వచ్చినా డోంట్ కేర్ అంటూ ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రెండవ భాగంలో హీరో పాత్రను ఎవరు పోషిస్తారు? అన్నది ఇప్పటికే ఆసక్తికరంగా మారింది. ఇప్పటకే రణవీర్ సింగ్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రేసులో బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ కూడా నిలిచారు. ప్రస్తుతం హృతిక్ విక్రమ్ వేద ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు.
ఈ సందర్భంగానే దేవ్ పాత్ర కోసం తనని సంప్రదిస్తున్నట్లు గా లీకులందించారు. ఈ నేపథ్యంలో బ్రహస్మ-2 కోసం రణవీర్..హృతిక్ మధ్య గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. బాలీవుడ్ లో ఇద్దరు స్టార్ హీరోలే. హృతిక్ రేంజ్ కి రణవీర్ ఇప్పుడిప్పుడే చేరుతున్నాడు. మరి మేకర్స్ రణవీర్ కి ఛాన్స్ ఇస్తారా? హృతిక్ ని తీసుకుంటారా? అన్నది చూడాలి.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏడాది చివర్లో వచ్చే అవకాశం ఉంది. పార్ట్ 2 స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇప్పటికే ధృవీకరించారు. షూటింగ్ వీలైనంత త్వరంగా ప్రారంభించాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2025 చివరి నాటికి పార్ట్ 2ని విడుదల చేయడానికి మేకర్స్ ఆసక్తిగా చూపిస్తున్నారు.
అలాగే రెండవ భాగం కోసం బడ్జెట్ భారీగానే కేటాయిస్తున్నట్లు సమాచారం. మొదటి భాగాన్ని మించి అంటే 400 కోట్ల రూపాయల బడ్జటె్ ని మించి రెండవ భాగానిక ఇకేటాయించనున్నారు. సినిమాలో కాస్టింగ్ ని బట్టి బడ్జెట్ పెరగడమా? తగ్గడమా? అన్నది డిసైడ్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇంకా పలువురు బాలీవుడ్ నటీనటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. స్టార్ స్టూడియోస్‌తో కలిసి కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ బ్రహ్మాస్త్ర రెండవ విడతను నిర్మించనున్నారు.
బాలీవుడ్ సైతం ఇప్పుడిప్పుడే సౌత్ మార్కెట్ పై కన్నేస్తుంది. తమ చిత్రాల్ని దక్షిణాదిన రాణించేలా అవసరం మేర సౌత్ సెలబ్రిటీల్ని సైతం రంగంలోకి దించుతున్నారు. బ్రహ్మస్ర మొదటి భాగంలో నాగార్జున లాక్ చేసారు. మరి రెండవ భాగం కోసం ఏ స్టార్ హీరోని అప్రోచ్ అవుతారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.