Begin typing your search above and press return to search.

మెగా వీరన్న ఇంట్రెస్టింగ్‌ అప్డేట్ లీక్‌

By:  Tupaki Desk   |   20 Sep 2022 5:41 AM GMT
మెగా వీరన్న ఇంట్రెస్టింగ్‌ అప్డేట్ లీక్‌
X
మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమా కి వాల్తేరు వీరన్న అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. త్వరలోనే టైటిల్‌ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవ్వడంతో పాటు సినిమా యొక్క ఫస్ట్‌ లుక్ ను కూడా రివీల్‌ చేసే అవకాశం ఉంది.

ఈ సమయంలో సినిమా గురించిన ఆసక్తికర షూటింగ్‌ అప్‌డేట్‌ ప్రస్తుతం సినీ వర్గాల ద్వారా లీక్ అయ్యింది. ఈ సినిమా కి సంబంధించిన కీలక షెడ్యూల్‌ ను నిన్నటి వరకు హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఒక గ్రామానికి సంబంధించిన సన్నివేశాల కోసం రాజమండ్రి లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్‌ సభ్యులు అక్కడకు చేరుకున్నారు.

ఈ షెడ్యూల్‌ లో మెగాస్టార్‌ చిరంజీవి తో పాటు మాస్ రాజా రవితేజ కూడా జాయిన్ అవ్వబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్‌ లో కీలకమైన రవితేజ మరియు చిరంజీవి కాంబో సన్నివేశాల చిత్రీకరణ జరుగబోతుంది. ఇప్పటికే రవితేజ ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించిన యూనిట్‌ సభ్యులు ప్రస్తుతం ఆయన్ను షూట్‌ లో జాయిన్ చేశారు.

చిరంజీవి మరియు రవితేజ ల యొక్క కాంబో సన్నివేశాలు తప్పకుండా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తూ ఉండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇదే సమయంలో గెస్ట్‌ రోల్‌ లో వెంకటేష్ కనిపించబోతున్నట్లుగా ఇటీవల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ విషయంలో నిజం ఎంత అనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.