Begin typing your search above and press return to search.

ధనుష్ 50… మరి తెలుగు స్టార్స్?

By:  Tupaki Desk   |   19 Jan 2023 5:30 PM GMT
ధనుష్ 50… మరి తెలుగు స్టార్స్?
X
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. కెరియర్ ఆరంభంలో ధనుష్ ని చూసిన అందరూ కూడా ఇతను కూడా హీరో అయిపోయాడు అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఇప్పుడు అందరూ కూడా హీరో అంటే కండలు తిరిగిన శరీరం అవసరం లేదు. కచ్చితమైన నటనతో మెప్పించే టాలెంట్ ఉండాలి అని ధనుష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

సౌత్ ఇండియా నుంచి రజినీకాంత్ తర్వాత హాలీవుడ్ సినిమాలో నటించిన మొదటి స్టార్ యాక్టర్ గా ధనుష్ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కేవలం తమిళ్ కి మాత్రమే పరిమితం కాకుండా బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు రెండు తెలుగు సినిమాలు చేయడానికి ధనుష్ ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇక కెప్టెన్ మిల్లర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకునే పనిలో ధనుష్ ఉన్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా తన 50వ సినిమాని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశాడు. సన్ పిక్చర్స్ ఈ ప్రతిష్టాత్మకమైన సినిమాని పాన్ ఇండియా లెవల్ లో నిర్మించబోతూ ఉండటం విశేషం. ఇదిలా ఉంటే కేవలం హీరోగానే కాకుండా సింగర్ గా, రైటర్ గా, దర్శకుడి, నిర్మాతగా మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అనే బ్రాండ్ ని ధనుష్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలో తన 50వ సినిమాకి అతనే దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఎస్.జె.సూర్య, విష్ణు విశాల్ కూడా కీలక పాత్రలలో నటించబోతున్నట్లు కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది.

అయితే ధనుష్ చాలా వేగంగా 50 సినిమాల ఫీట్ ని అందుకోగా ఇంకా మన తెలుగు స్టార్స్ లో ఎవరూ కూడా అందుకోలేదని చెప్పాలి. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్స్ గా ఉన్న మన తెలుగు హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, లలో ఎవరూ కూడా ఇంకా 30 సినిమాలని కూడా పూర్తి చేయలేకపోయారు. టైర్ 2 హీరోలుగా ఉన్నవారిలో కూడా ఎవరూ ఈ 50 సినిమాల ఫీట్ ని అందుకోలేదు.

ప్రస్తుతం వారి ఎంపికలు, సినిమాల కోసం తీసుకుంటున్న టైం చూస్తుంటే 50 సినిమాల రికార్డ్ ని వారు చేరుకోవడానికి కనీసం 10 ఏళ్ళు అయినా పడుతుంది. అంతకు మించి పట్టిన ఆశ్చర్యం లేదు. అయితే ఒకప్పటి స్టార్ హీరోలైన బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి మాత్రం ఏడాదిలో 5 సినిమాలకి పైగా చేసుకుంటూ వెళ్లి సెంచరీ కొట్టేశారు. ఈ జెనరేషన్ టాలీవుడ్ హీరోలలో ఆ స్పీడ్ లేదని చెప్పాలి. దీనికి కారణం తమ ఇమేజ్ అని చెప్పాలి. ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని కథలని ఎంపిక చేసుకోవడంతో ఒక్కో సినిమాకి ఏడాది సమయం మన స్టార్స్ తీసుకుంటున్నారు అనే మాట వినిపిస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.