Begin typing your search above and press return to search.
ధనుష్ సినిమా రిలీజ్ అవుతుందని ఎంతమందికి తెలుసు..?
By: Tupaki Desk | 18 Aug 2022 4:49 AM GMTతెలుగులో మంచి మార్కెట్ ఉన్న తమిళ హీరోలలో ధనుష్ ఒకరు. తాను నటించే ప్రతీ చిత్రాన్ని డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తూ.. ఇక్కడి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో 'సార్' సినిమాతో నేరుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. అయితే అంతకంటే ముందుగా ఇప్పుడు ''తిరు'' అనే డబ్బింగ్ చిత్రంతో పలకరించబోతున్నాడు.
ధనుష్ హీరోగా నిత్యా మీనన్ - రాశీఖన్నా - ప్రియా భవాని శంకర్ వంటి ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటించిన చిత్రం ''తిరుచిత్రంబళం''. జవహర్ ఆర్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు (ఆగస్ట్ 18) గురువారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. 'తిరు' అనే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు.
అయితే ధనుష్ సినిమా రిలీజ్ అవుతుందని చాలా మందికి అసలు తెలియలేదు. సడన్ గా డేట్ లాక్ చేసుకొని రేసులోకి వచ్చిన ఈ చిత్రానికి తెలుగులో జీరో బజ్ ఉంది. మాములుగా ధనుష్ మూవీ విడుదల అవుతుందంటే ఇక్కడ కూడా అంతో ఇంతో క్రేజ్ ఉంటుంది. కానీ 'తిరు' విషయంలో అలా జరగలేదు.
తమిళ వెర్షన్ కు సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ తో బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయగా.. తెలుగు వెర్షన్ కి మాత్రం సరైన ప్రమోషన్స్ లేవు. నాలుగు రోజుల క్రితం ట్రైలర్ ను విడుదల చేశారు కానీ.. ఆ తర్వాత ఎలాంటి కంటెంట్ ను వదల్లేదు. దీంతో అవసరమైన హైప్ ని సృష్టించలేకపోయింది.
'తిరు' చిత్రంలో ధనుష్ - నిత్యా మీనన్ - ప్రియా భవానీ శంకర్ - రాశి ఖన్నా లతో పాటుగా ప్రకాష్ రాజ్ - భారతీరాజా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చారు. సన్ పిక్చర్స్ బ్యానర్ లో కళానిది మారన్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ వారు రిలీజ్ చేస్తున్నారు.
ఏ సినిమాకైనా బజ్ క్రియేట్ చేయడానికి ఈ అంశాలు సరిపోతాయి. స్టార్ క్యాస్టింగ్ - మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ - ప్రముఖ నిర్మాణ సంస్థ ఉన్నా 'తిరు' చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లలేకపోయారనే చెప్పాలి.
'సార్' సినిమాతో నేరుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్నారు ధనుష్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ మూవీని వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. దీని తర్వాత ఏసియన్ ప్రొడక్షన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో ఓ మూవీ చేయనున్నారు.
ఇలా బ్యాక్ టూ బ్యాక్ స్ట్రెయిట్ తెలుగు సినిమాలు ప్లాన్ చేసుకున్న ధనుష్.. 'తిరు' చిత్రానికి ఇక్కడ తగినంత ప్రచారం చేయలేదు. ఓపెనింగ్ డే రోజు భారీ వసూళ్లను ఆశించలేం. ఈవారం రిలీజ్ అయ్యే చిత్రాల్లో క్రేజీ సినిమా ఏదీ లేదే కాబట్టి.. టాక్ కీలకమని చెప్పాలి. మరి టాలీవుడ్ లో పాగా వేసేందుకు ప్లాన్ చేసుకుంటున్న ధనుష్ కు ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూడాలి.