Begin typing your search above and press return to search.
స్టార్ ప్రొడ్యూసర్ లెక్క ఎక్కడ తప్పుతోంది?
By: Tupaki Desk | 8 Oct 2022 7:33 AM GMTస్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఇండస్ట్రీలో ఈ పేరుకు తిరుగులేదు. ఆయన జడ్జిమెంట్ కి ఎదురులేదు. కానీ అది గత కొంత కాలంగా తారు మారవుతూ వస్తోంది. ఆయన జడ్జిమెంట్ తో పాటు ప్రేక్షకుల నాడిని అంచనా వేయడం లోనూ దారుణంగా విఫలమవుతున్నారు. దీంతో ఆయన స్టేట్ మెంట్ లపై సోషల్ మీడియా వేదికగా కామెంట్ లు పేలుతున్నాయి. వివరాల్లోకి వెళితే..దిగ్గజ దర్శకుడు మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్ 1'. భారీ తారాగణం నటించిన ఈ ఈ మూవీని తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేశారు.
తమిళం తో పాటు పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదలైన ఈ మూవీ కేవలం తమిళంలో మినహా ఇతర భాషలలో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోతోంది. ఇప్పటి వరకు ఈ మూవీ రూ. 300 కోట్ల మేర వసూళ్లని రాబట్టిందని చెబుతున్నారు. అయితే అందులో అత్యధిక శాతం తమిళ ఇండస్ట్రీ నుంచి, తమిళ వెర్షన్ వల్ల సాధించినవే కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఈ మూవీ ఓ విజువల్ వండర్ అని, బాక్సాఫీస్ వద్ద ఆ విషయాన్ని నిరూపించిందని దిల్ రాజు కామెంట్ చేయడం ఇప్పడు కామెడీగా మారింది.
దీనిపై నెటిజన్ లు తలోరకంగా కామెంట్ లు చేస్తూ నెట్టింట స్టార్ ప్రొడ్యూసర్ ని ఆడుకుంటున్నారు. 'పొన్నియిన్ సెల్వన్ 1' తమిళ ప్రేక్షకులకు మాత్రమే నచ్చిన కథ, పక్కా తమిళ నేటివిటీ వున్న కథ. ఇది స్వయంగా మేకర్స్ చెప్పిన మాట. ప్రచార సమయంలోనూ ఇది చోళ రాజుల కథ అని పక్కాగా చెప్పారు. ఇదే ఈ సినిమా ఇతర భాషల్లో ఆకట్టుకోలేకపోవడానికి ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులు ఓన్ చేసుకోలేకపోవడానికి ప్రధాన కారణంగా మారింది.
తెలుగులో మణిరత్నం క్రేజ్ కారణంగా కొంత మేర చెప్పుకోదగ్గ రీతిలో వసూళ్లని రాబట్టింది కానీ హిందీలో అయితే దీన్ని పట్టించుకున్న వాళ్లే లేరు. అక్కడ పెద్దగా ఈ మూవీకి స్పందనే లేదు. అలాంటిది దిల్ రాజు మాత్రం విజువల్ వండర్ అని, ఆ కారణంగానే ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని అనడం ఎంత వరకు కరెక్టో ఆయనకే తెలియాలని నెటిజన్ లు కామెంట్ లు చేస్తున్నారు.
దిల్ రాజు చెప్పినట్టే సినిమా విజువల్ వండర్ అయితే తమిళంలో ఆకట్టుకున్న విధంగానే ఇతర భాషల్లోనూ 'పొన్నియిన్ సెల్వన్ 1' అదే తరహా విజయాన్ని అందుకుని వుండేది కదా? అన్నది నెటిజన్ ల వాదన.
ఈ నేపథ్యంలో దిల్ రాజు జడ్జిమెంట్ పై నెటిజన్ లు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్పారు. గత కొంత కాలంగా ఆయన లెక్క తప్పుతోందని, జడ్జిమెంట్ కూడా మారుతోందని కామెంట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు స్టార్ హీరో రామ్ చరణ్ - శంకర్ ల కలయికలో ఓ భారీ మూవీతో పాటు తమిళ స్టార్ విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో 'వారసుడు' మూవీని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ రెండింటిలో విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం సంక్రాంతి బరిలో నిలిచే అవకాశం వుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.