Begin typing your search above and press return to search.

జాతిరత్నాలు డైరెక్టర్.. ప్రిన్స్ రెమ్యునరేషన్ ఎంత?

By:  Tupaki Desk   |   12 Oct 2022 1:30 AM GMT
జాతిరత్నాలు డైరెక్టర్.. ప్రిన్స్ రెమ్యునరేషన్ ఎంత?
X
సినిమా ప్రపంచంలో ఇటీవల కాలంలో దర్శకులు కూడా దాదాపు హీరోల రేంజ్ లోనే రెమ్యునరేషన్ డోస్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క హిట్ వచ్చినప్పుడే కోట్లల్లో వారి జీతాలు లేరుగుతున్నాయి. ఇక జాతి రత్నాలు దర్శకుడు కూడా రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం. అతను మొదట షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు అందుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్ లోనే కొన్ని సినిమాలకు సహాయక దర్శకుడిగా పనిచేసే ఫస్ట్ సినిమాను అదే సంస్థలో చేశాడు.

సురేష్ బాబు అతన్ని నమ్ము బడ్జెట్ కూడా కాస్త ఎక్కువగానే పెట్టారు. కానీ పిట్టగొడ అనే ఆ సినిమా దారుణమైన ఫలితం ముందుకుంది. పెట్టిన పెట్టుబడిలో కనీసం కొత్త కూడా వెనక్కి రాలేదు.

ఇక తర్వాత డైరెక్టర్ అనుదీప్ కు పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. మళ్లీ స్ట్రగుల్ అవుతున్న తరుణంలోనే నాగ్ అశ్విన్ నుంచి పిలుపు వచ్చింది. ఇక అతనిపై నమ్మకంతో దాదాపు ఏడు కోట్ల వరకు ఖర్చుపెట్టి జాతిరత్నాలు అనే సినిమా చేశారు.

ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 27 కోట్ల వరకు ప్రాఫిట్ అందించింది. ఇక ఆ సినిమాకు అనుదీప్ అయితే చాలా తక్కువ తీసుకున్నాడు. ఇక జాతి రత్నాలు సక్సెస్ కావడంతో అతనికి మిగతా ప్రొడక్షన్ ల నుంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. అడిగితే 7 కోట్ల వరకు పారితోషం ఇచ్చేవారున్నారు. అలంటూ ఆఫర్లు అయితే వచ్చాయి.

కానీ అనుదీప్ మాత్రం సురేష్ బాబుకు హిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మరో ప్రొడక్షన్ సంస్థతో కలిసి ప్రిన్స్ అనే సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నాడు. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ సినిమాకు అతను ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

ఈ దీపావళికి అక్టోబర్ 21న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ట్రైలర్ కూడా మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.