Begin typing your search above and press return to search.
పబ్లిసిటీ కోసం రాంగ్ రూట్.. మొదటికే మోసం
By: Tupaki Desk | 15 Aug 2022 2:30 AM GMTతాప్సి ప్రధాన పాత్రలో అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన 'దొబారా' సినిమా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడ్డా కూడా ఇప్పటి వరకు కనీసం బజ్ క్రియేట్ కాలేదు. అసలే బాలీవుడ్ సినిమాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో సినిమాకు బజ్ క్రియేట్ కాకుంటే మినిమం వసూళ్లు కూడా వచ్చే అవకాశం లేదు.
ఈ నేపథ్యంలోనే తమ సినిమాకు ఏదో ఒక రకంగా ప్రమోషన్ ను చేయాలని.. పబ్లిసిటీ లో కొత్త పుంతలు తొక్కే ప్రయత్నం చేశారు. పబ్లిసిటీ కోసం రాంగ్ రూట్ ను తాప్సి మరియు అనురాగ్ కశ్యప్ లు ఎంచుకుని పెద్ద తప్పు చేశారు. మూలిగే నక్క మీద.. ఏదో అన్నట్లుగా ఇప్పుడు దొబారా సినిమా కు మరింతగా డ్యామేజీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అసలు విషయం ఏంటంటే.. ఇటీవల విడుదల అయిన లాల్ సింగ్ చడ్డా సినిమా యొక్క ఫలితం గురించి తెల్సిందే. అంతకు ముందు సినిమా ను బ్యాన్ చేయాల్సిందిగా దేశ వ్యాప్తంగా ప్రచారం జరిగింది.
గతంలో అమీర్ ఖాన్ వ్యవహరించిన తీరుకు నిరసనగా ఆయన సినిమా ను బ్యాన్ చేయాల్సిందే అంటూ సోషల్ మీడియాలో లాల్ సింగ్ చడ్డా బ్యాన్ హ్యాష్ ట్యాగ్ మూడు నాలుగు రోజుల పాటు ట్రెండ్ అయ్యింది.
లాల్ సింగ్ చడ్డా సినిమా తరహాలోనే దొబారా కు కూడా ప్రమోషన్ కావాలని తాప్సి మరియు అనురాగ్ కశ్యప్ లు ప్రయత్నించారు. లాల్ సింగ్ చడ్డా సినిమా తరహా లోనే తమ సినిమా ను కూడా బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే బాగుండు అంటూ వీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు అదే సినిమా కు నష్టం చేకూర్చే పరిస్థితి కనిపిస్తుంది.
గతంలో మోడీ కి వ్యతిరేకంగా అనురాగ్ కశ్యప్ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలను కొందరు ఇప్పుడు తెర ముందుకు తీసుకు వచ్చారు. దాంతో సినిమా ను బ్యాన్ చేయాల్సిందే అని.. దేశ ద్రోహి అనురాగ్ కశ్యప్ అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. పబ్లిసిటీ కోసం రాంగ్ రూట్ లో వెళ్లిన అనురామ్ కశ్యప్ మరియు తాప్సి ఇప్పుడు తల పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.