Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: ఆ ఇద్దరూ కథ మార్చిన పురుషులవుతారా?
By: Tupaki Desk | 13 Oct 2022 2:30 AM GMTబాలీవుడ్ సౌత్ రీమేక్ ల కోసం తపిస్తోంది. తెలుగు లేదా తమిళం మలయాళంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలను రీమేక్ చేసేందుకు హిందీ దర్శకనిర్మాతలు.. హీరోలు కూడా ఆసక్తిగా ఉన్నారు. దీంతో సన్నివేశం అమాంతం మారింది. అయితే హిందీ చిత్రసీమ అనుసరిస్తున్న ఈ విధానంపై ప్రముఖులు సీరియస్ గా ఉన్నారు. ఒరిజినల్ కథలు సొంత కథలు రాయకుండా ఇలా పరాయి కథలను ఎరువు తెచ్చుకోవడం ఏమిటీ? అంటూ విరుచుకుపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో కింగ్ ఖాన్ షారూక్ ఒక ఒరిజినల్ స్క్రిప్టులో నటిస్తున్నారు. అది రాజ్ కుమార్ హిరాణీ అందిస్తున్న డుంకీ.
షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తున్నాడు. 2023లో అతను నటించిన మూడు సినిమాలు - పఠాన్- జవాన్ - డుంకీ విడుదల కానున్నాయి. ఈ మూడు చిత్రాలకు విపరీతమైన హైప్ ఉంది. డుంకీ వీటిలో ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో అందరి కళ్లు దీనిపై ఉన్నాయి. ఇది ఒరిజినల్ స్క్రిప్టుతో వస్తోంది గనుక కచ్చితంగా హిట్ అవుతుందని ట్రేడ్ భావిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలిలా ఉన్నాయి.
తాజా నివేదిక ప్రకారం.. ఇందులో సీనియర్ నటుడు బోమన్ ఇరానీ .. సతీష్ షా వంటి ప్రతిభావంతులు షారూఖ్ ఖాన్ తో కలిసి నటిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. SRK ఈ ఇద్దరు నటులతో కొన్ని చిరస్మరణీయ చిత్రాలకు కలిసి పనిచేశాడు. చాలా గ్యాప్ తర్వాత వారితో తిరిగి కలుస్తున్నాడు. తాజా కథనం ప్రకారం.. అక్రమ ఆసియా వలసదారుల కేసులపై పోరాడే లండన్ కు చెందిన న్యాయవాదిగా సతీష్ షా నటించారు. బొమన్ ఇరానీ.. అదే సమయంలో పంజాబీ యువతకు ఇంగ్లీష్ మాట్లాడే తరగతులు చెప్పే ఉపాధ్యాయుని పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమా కాన్వాస్ అత్యంత భారీగా ఎమోషనల్ కంటెంట్ తో అలరిస్తుందని చెబుతున్నారు.
షారూఖ్ మొదటిసారిగా బోమన్ ఇరానీతో కలిసి మెయిన్ హూ నా (2004)లో నటించారు. ఇందులో బొమన్ ఒక ఫన్నీ కాలేజీ ప్రిన్సిపాల్ పాత్రను పోషించాడు. వారి కెమిస్ట్రీ చాలా ప్రశంసలు అందుకుంది. వీరిద్దరూ వీర్-జారా (2004) - డాన్ (2006)- డాన్ 2 (2011)- హ్యాపీ న్యూ ఇయర్ (2014) - దిల్ వాలే (2015)లో కలిసి కనిపించారు.
కొన్ని నెలల క్రితం జరిగిన ఒక కార్యక్రమంలో బొమన్ ఇరానీని మీడియా 'డుంకీ' గురించి రాజ్ కుమార్ హిరానీ తో కలిసి అన్ని చిత్రాలలో రెగ్యులర్ గా పని చేయడం గురించి అడిగింది. ఇది రాజ్ కుమార్ హిరానీకి ఆరో చిత్రం .. నేను అతనితో కలిసి పని చేయడం ఇది ఆరోసారి! అతడు నా స్నేహితుడు .. బహుత్ కమాల్ కే డైరెక్టర్ హై'' అని బోమన్ వ్యాఖ్యానించాడు. ''డుంకీ చాలా అసాధారణమైన సబ్జెక్ట్. ఇది మునుపటి రాజ్ కుమార్ హిరాణీ చిత్రాల కంటే వినోదభరితంగా లేదా అంతకుమించి వినోదాత్మకంగా ఉంటుంది. మీరు దాన్ని ఆస్వాధిస్తారు. ఇది చూశాక ఏదో ఒక అంశాన్ని ఆలోచింపజేసేలా ఉంటుంది. జీవితం గురించి మీకు అర్థమయ్యేలా చేస్తుంది. నేను డుంకీ కోసం ఇంకా వేచి ఉండలేను. విడుదలకు త్వరగా వస్తుందని ఆశిస్తున్నా'' అన్నారు.
కభీ హాన్ కభీ నా (1994)తో ప్రారంభించి దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే (1995)- ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ (2000)- చల్తే చల్తే (2003)- కల్ హో నా హో (2003)- సతీష్ షాతో కలిసి అనేక చిరస్మరణీయ చిత్రాలలో SRK పనిచేశారు. మై హూ నా (2004)- ఓం శాంతి ఓం (2007) మరియు రా.వన్ (2011) చిత్రాలలో సతీష్ షా నటించారు. మై హూ నాలో షారుఖ్ ఖాన్ - సతీష్ షా హాస్య సన్నివేశాలు నేటికీ గుర్తుండిపోతాయి. అంతేకాకుండా ఖాన్ కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మించిన ఆల్వేస్ కభీ కభీ (2011)లో కూడా సతీష్ షా పనిచేశాడు.
డుంకీలో తాప్సీ పన్ను - విక్కీ కౌశల్ కూడా నటించారు. ప్రముఖ మీడియా ప్రకారం షారుఖ్ ఖాన్ ఇతర నటీనటులతో మహారాష్ట్రలోని వాయ్ లో ఈ చిత్రానికి సంబంధించిన ఓ చిన్న షెడ్యూల్ ను కలిగి ఉన్నారు. ఇంకా 20-25 రోజుల చిత్రీకరణ మిగిలి ఉందని తెలిసింది. 22 డిసెంబర్ 2023న 'డుంకీ' సినిమా థియేటర్లలో విడుదలవుతుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.