Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ మ్యాన్ -3 పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!

By:  Tupaki Desk   |   26 Nov 2022 1:30 PM GMT
ఫ్యామిలీ మ్యాన్ -3 పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్!
X
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండు సీజ‌న్లు ఎంత పెద్ద స‌క్సెస్ అయ్యాయో చెప్పాల్సిన ప‌నిలేదు. అమెజాన్ ప్రైమ్లో ఓ బ్రాండ్ సిరీస్ గా గా ఫేమ‌స్ అయింది. ఎన్నో వెబ్ సిరీస్ లు వ‌చ్చాయి..వెళ్లాయి. కానీ ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్లు పాపుల‌ర్ అయినంత‌గా మ‌రే సిరీస్ కాలేదు. ఈనేప‌థ్యంలో ఫ్యామిలీ మ్యాన్ 3 కూడా తెర‌కెక్కిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

ఆ సిరీస్ కోసం ప్రేక్ష‌కాభిమానులు ఎంతో ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈసిరీస్ గురించి మ‌నోజ్ బాజ్ పాయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ది ఫ్యామిలీ మ్యాన్ -3 మొద‌లు పెట్ట‌డానికి అమెజాన్ సిద్దంగా ఉంది. కానీ ద‌ర్శ‌కుడు రాజ్-డీకేల‌తో పాటు నేను కూడా ఇత‌ర ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నాను. ఏడాది చివ‌రి వ‌ర‌కూ ప‌రిస్థితి అలాగే ఉంటుంది.

వ‌చ్చే ఏడాది మొద‌ట్లో సీజ‌న్ -3 మొద‌లు పెట్ట‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు తెలిపారు. దీంతో ఫ్యామిలీ మ్యాన్ అభిమానుల‌కు పండ‌గ‌లాంటి వార్త‌లా నెట్టింట వైరల్ అవుతుంది. మూడ‌వ సీజ‌న్ ఎప్పుడు ప్రారంభం అవుతుందని కొన్ని నెల‌లుగా వెయిట్ చేస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎన్నో సార్లు వివ‌ర‌ణ కోర‌గా ఎలాంటి బ‌ధులివ్వ‌లేదు.

దీంతో తాజాగా మ‌నోజ్ బాజ్ పాయ్ క్లారిటీతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈసిరీస్ లో పాత న‌టీన‌టుల‌తో పాటు కొంత మంది కొత్త న‌టులు భాగ‌మ‌వుతున్నారు. మనోజ్ బాజ్ పాయ్ తో పాటు స‌మంత కూడా న‌టిస్తుంది.

ఇప్ప‌టికే వాళ్లిద్ద‌రు న‌టిస్తున్న‌ట్లు అధికారికంగా అమెజాన్ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. అయితే డిలే అవ్వ‌డంతో సిరీస్ నుంచి మ‌నోజ్ త‌ప్పుకుంటున్న‌ట్లు ఆమ‌ధ్య ప్ర‌చారం సాగింది.

కానీ తాజాగా మ‌నోజ్ వివ‌ర‌ణ‌తో ఆయ‌న త‌న పాత్ర‌లో యధావిధిగా కొనసాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం మ‌నోజ్ బాజ్ పాయ్ హిందీ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. అలాగే స‌మంత కూడా అనారోగ్యానికి గురి కావ‌డంతో విశ్రాంతిలో ఉన్నారు. ఆమె కోలుకోవ‌డానికి కొంచెం స‌మ‌యం ప‌డుతుందని డాక్ట‌ర్లు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఆమె న‌టిస్తోన్న‌సినిమాలు కూడా ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.