Begin typing your search above and press return to search.

కరణ్ జోహార్ తెలివే తెలివి..!

By:  Tupaki Desk   |   19 Nov 2022 2:30 AM GMT
కరణ్ జోహార్ తెలివే తెలివి..!
X
బాలీవుడ్ బడా దర్శక నిర్మాత కరణ్ జోహార్ బిజినెస్ మైండ్ కి అందరు ఫిదా అవ్వాల్సిందే. సినిమా మార్కెట్ విషయంలో ఆయన ప్లానింగ్ అదిరిపోతుంది. కరణ్ జోహార్ నిర్మించిన లేటెస్ట్ మూవీ గోవిందా నామ్ మేరా.. విక్కీ కౌశల్, కియరా అద్వాని, భూమి పడ్నేకర్ నటించిన ఈ మూవీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుంది. సినిమాని ఇప్పటికే ఓటీటీ డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అని చిత్రయూనిట్ ప్రకటించారు. అయితే లేటెస్ట్ గా డిస్నీ హాట్ స్టార్ ఓటీటీ ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు గోవిందా నామ్ మేరా సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్ చేసింది.

విక్కీ కౌశల్ గోవిందా నామ్ మేరా మూవీ డిసెంబర్ 16న డిస్నీ హాట్ స్టార్ లో రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ కియరా అద్వాని ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అంటున్నారు.

సినిమా నిర్మించడమే కాదు సరైన టైం లో రిలీజ్ చేయడం కూడా నిర్మాతల తెలివిని ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల పరిస్థితి అంత గొప్పగా ఏమి లేదు. స్టార్ హీరోల సినిమాలే అక్కడ క్రౌడ్ పుల్లింగ్ లేక ఖాళీగా ఉంటున్నాయి.

ఈ టైం లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న గోవిందా నామ్ మేరా ని థియేట్రికల్ రిలీజ్ చేసి రిస్క్ ఎందుకని అనుకున్నారు కరణ్ జోహార్. అందుకే సినిమాని డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేశారు. డిజిటల్ రిలీజ్ అవుతున్నా సరే సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ చేస్తున్నారు. కరణ్ జోహార్ ఇలాంటి విషయాల్లో చాలా క్లవర్ గా ఉంటారు.

ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా నటిస్తున్న మిషన్ మజ్ను కూడా ఓటీటీ రిలీజ్ కే ఫిక్స్ చేయగా ఇప్పుడు గోవిందా నామ్ మేరా సినిమా కూడా ఓటీటీ రిలీజ్ అనేసరికి థియేట్రికల్ రిలీజ్ అంటే బాలీవుడ్ మేకర్స్ ఎంత కంగారు పడుతున్నారో అర్ధమవుతుంది.

అందుకే రిస్క్ ఎందుకు అనుకుని ఓటీటీలతోనే డీల్ సెట్ చేసుకుంటున్నారు. మిషన్ మజ్ను ఓటీటీ రిలీజ్ కన్ఫర్మ్ కాగా ఏ ఓటీటీ అన్నది ఇంకా బయటకు చెప్పలేదు. గోవిందా నామ్ మేరా మాత్రం డిస్నీ హాట్ స్టార్ కి ఇచ్చేశారు. శశాంక్ ఖైతాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు మేకర్స్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.