Begin typing your search above and press return to search.

వీరమల్లు సమ్మర్ కి కూడా కష్టమేనా..?

By:  Tupaki Desk   |   5 Jan 2023 1:30 AM GMT
వీరమల్లు సమ్మర్ కి కూడా కష్టమేనా..?
X
పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబోలో వస్తున్న పీరియాడికల్ మూవీ హరి హర వీరమల్లు ప్రచార చిత్రాల సందడి చాలా బాగుంది. పవన్ తన రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఈ సినిమా చేస్తున్నాడు. కెరీర్ లో మొదటిసారి డిఫరెంట్ గెటప్ తో.. సరికొత్త కథతో వస్తున్నారు. సినిమా అనుకున్న విధంగా షూటింగ్ జరగలేదు. పవన్ డేట్స్ వల్ల షూటింగ్ కొంత గ్యాప్ వచ్చింది.

పవన్ ఈమధ్య ఈ సినిమాను పూర్తి చేసేందుకు కావాల్సిన డేట్స్ ఇచ్చేశాడని తెలుస్తుంది. ఈ సినిమాను ఎలాగైనా పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు పవన్ కళ్యాణ్. అనుకున్న విధంగా జరిగితే ఈ సమ్మర్ కి సినిమా రిలీజ్ అవుతుందట. కానీ రీసెంట్ గా ఈ సినిమా నిర్మాత ఏ.ఎం రత్నం మాటల ప్రకారం సినిమా సమ్మర్ కి రిలీజ్ అవడం కూడా కష్టమే అని అంటున్నారు.

క్రిష్ అంతకుముందు సినిమాలన్ని చాలా తక్కువ టైం లో అనుకున్న విధంగా పూర్తి చేయగలిగాడు కానీ వీరమల్లు విషయంలో అతని లెక్క పూర్తిగా తప్పింది. పవన్ ఇచ్చిన డేట్స్ లోనే సినిమా పూర్తి చేయాలనే కారణంతో సినిమా లేట్ అవుతూ వచ్చింది. సినిమా దాదాపు ముగింపు దశకు చేరుకోగా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చాలా చేయాల్సి ఉందట. దీనికోసమే సినిమా సమ్మర్ కల్లా తెచ్చే అవకాశం లేదని అంటున్నారు.

ఈమధ్య మన ఆడియన్స్ హాలీవుడ్ సినిమాలు కూడా చూస్తున్న కారణంగా నాసిరకమైన గ్రాఫిక్స్ పెడితే మాత్రం ఆడేసుకుంటున్నారు. అందుకే వి.ఎఫ్.ఎక్స్ వర్క్ విషయంలో లేట్ అయినా పర్లేదు కానీ జాగ్రత్తగా చేయాలని చూస్తున్నారు. ఆదిపురుష్ సినిమా టీజర్ లో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పై దారుణమైన ట్రోల్స్ చేశారు.

ఆ కామెంట్స్ ని దృష్టిలో పెట్టుకునే వీరమల్లు సినిమా గ్రాఫిక్స్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. క్రిష్ ఈ విషయంలో అసలు కాంప్రమైజ్ కాకూడదని ఫిక్స్ అయ్యారట. అందుకే సినిమాని కుదిరితే సమ్మర్ కి లేదా దసరాకి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. నిధి అగర్వాల్, జాక్వెలిన్ నటిస్తున్న ఈ సినిమాకు కీరావణి మ్యూజిక్ అందిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.