Begin typing your search above and press return to search.

ఇండియన్ 2 రిలీజ్.. ఇది పెద్ద రెకార్డ్!

By:  Tupaki Desk   |   13 Oct 2022 7:31 AM GMT
ఇండియన్ 2 రిలీజ్.. ఇది పెద్ద రెకార్డ్!
X
సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా తన సినిమాలతో దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపును అందుకున్న సంచలన దర్శకుడు శంకర్ కెరీర్లో మొదటిసారి కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. అతను స్టార్ దర్శకుడిగా మారిన తర్వాత రాజమౌళి తరహాలోనే కొన్నేళ్ల వరకు అపజయాలు తెలియకుండా ముందుకు కొనసాగాడు. ఇక అతను రోబో సినిమా తర్వాత ఇంతవరకు సరైన సక్సెస్ అందుకోలేదు.

ఆ తర్వాత వచ్చిన ఐ మనోహరుడు స్నేహితుడు 2.0 మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సంచలనాలను ఏమి క్రియేట్ చేయలేకపోయాయి. అయితే ఈసారి శంకర్ ఎలాగైనా రాంచరణ్ 15వ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకోవాలని రెడీ అవుతున్నాడు. అంతకుముందే ఇండియన్ 2 సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

ఇక ఆ సినిమా నిర్మాతలతో వచ్చిన విభేదాలతో మధ్యలో వదిలేసి మళ్లీ ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు ప్రాజెక్టును రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు రెండు సినిమాలను దర్శకుడు శంకర్ రెండు చేతులతో పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నాడు.

ఒక విధంగా శంకర్ ప్రతి సినిమాకు కూడా దాదాపు ఏడాది లేదా రెండేళ్ల పాటు సమయం తీసుకుంటూ వచ్చాడు. కానీ ఇప్పుడు రెండు సినిమాలను పూర్తి చేస్తున్నాడు.

ఇక రాంచరణ్ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇండియన్ 2 సినిమా 2024 లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఒకవేళ కుదిరితే 2023 దీపావళికి ఇండియన్ 2 సినిమా రావచ్చు అని తెలుస్తోంది. కానీ అంతకుముందే శంకర రామ్ చరణ్ సినిమాను తొందరగా ఫినిష్ చేయాల్సి ఉంటుంది.

మరి శంకర్ ఇంకా ఎంత వేగాన్ని పెంచుతాడో చూడాలి. అలాగే శంకర్ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో అపరిచితుడు సీక్వెల్ ను తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఆ ప్రాజెక్ట్ అగ్రిమెంట్ కూడా ఇదివరకే ఫిక్స్ అయింది. ఇక ఇండియన్ 2 సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.