Begin typing your search above and press return to search.

ఇఫీ ఉత్స‌వాల్లో 79 దేశాలు..280 సినిమాలు!

By:  Tupaki Desk   |   21 Nov 2022 5:50 AM GMT
ఇఫీ ఉత్స‌వాల్లో 79 దేశాలు..280 సినిమాలు!
X
ప్ర‌తీ ఏడాది అంత‌ర్జాతీయ చ‌ల‌న చిత్రోత్స‌వాలు భార‌త్ లో ఘ‌నంగా నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా న‌వంబ‌ర్ 28వ ర‌కూ జ‌రుగుతోన్న 53వ ఉత్సావాల్నిఉద్దేశించి కేంద్ర‌మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ఇఫీ కంటెంట్ క్రియేష‌న్.. చిత్ర నిర్మాణం..షూటింగ్ ల‌కు శాశ్వ‌త వేదిక‌గా మారాల‌న్నారు. ఇఫీ ఆసియాలోనే అతి పెద్ద చిత్రోత్స‌వం. నిర్మాతలు ..ద‌ర్శ‌కులు ..క‌ళాకారులు త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకునేంద‌కు ఇదొక గొప్ప వేదిక .

ఇలాంటి కార్య‌క్ర‌మాల ద్వారా భార‌త్ సినిమాల‌కు ప్ర‌పంచ వేదిక‌గా మ‌లుచుకోవాలి. చిత్రోత్స‌వం ఉద్దేశం సంబురాలు జ‌రుపుకోవ‌డ‌మే కాదు. సినిమా అనే విప‌ణి ద్వారా భార‌తీయ సంస్కృతిని ప్ర‌పంచానికి చాటా చెప్పాలి. విదేశీ భాగ‌స్వామ్యంలో వేడుక స్థాయిని పెంచేలా తెలివైన నిర్ణ‌యాల‌తో ముందుకు వెళ్లాల‌ని అని సూచించారు.

ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు పాల్గొన్నారు. అజయ్ దేవ‌గ‌ణ్..కార్తీక్ అర్య‌న్... పంక‌జ్ త్రిపాఠీ..మ‌నోజ్ బాజ్ పాయ్...సునీల్ శెట్టి ..వ‌రుణ్ ధావ‌న్..సారా అలీఖాన్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ ఉత్స‌వాల్లో 79 దేశాల‌కు చెందిన 280 సినిమాలు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈసారి ప్ర‌దర్శ‌న‌కు ఎంపికైన సినిమాల్లో న‌ల‌భైశాతం మ‌హిళా ద‌ర్శ‌కులు రూపొందించేవి కావ‌డం విశేషం.

నేష‌న‌ల్ ఫిల్మ్ డెవ‌లెప్ మెంట్ కార్పోరేష‌న్.. ఎంట‌ర్ టైన్ మెంట్ సొసైటీ ఆఫ్ గోవా ఈ వేడుక‌ల్ని సంయుక్తంగా నిర్వ‌హిస్తున్నాయి. మొద‌టి రోజున సీనియ‌ర్ న‌టి ఆశా ఫ‌రేక్ కి దాదాసాహెబ్ ఫాల్కే పుర‌స్కారం.. స్పానిష్ ఫిల్మ్ మేక‌ర్ కార్లోస్ సౌరేకి స‌త్య‌జిత్ రే జీవిత కాల సాఫ‌ల్యాలు అందించ‌నున్నారు. ఇండియ‌న్ క్లాసిక్ విభాగంలో సీనియ‌ర్ దర్శ‌కులు కె. విశ్వ‌నాధ్ తెర‌కెక్కించిన 'శంక‌రాభ‌ర‌ణం' సినిమాని ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. తొమ్మిది రోజుల పాటు జ‌రిగే ఈ ఉత్స‌వాల్ని సెల‌బ్రిటీలు ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.

ఉత్స‌వాలు పేరుకు ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తుంది త‌ప్ప వాటిపై సెల‌బ్రిటీలు ఆస‌క్తి చూపించ‌డం లేదు. వాటి గురించి క‌నీసం సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్ కూడా చేయ‌డంలేదు.

ప్ర‌తీ ఏడాది అంత‌ర్జాతీయ బాలల చ‌ల‌న చిత్రోత్స‌వాలు హైద‌రాబాద్ లో ఎంతో ఘ‌నంగా జ‌రుగుతాయి. వివిధ దేశాల‌కు చెందిన ల‌ఘు చిత్రాల ప్ర‌ద‌ర్శ‌న వైభంగా జ‌రుగుతుంది. కానీ వాటిపై టాలీవుడ్ సెల‌బ్రిటీలు ఎవ‌రూ స్పందించ‌రు. సెల‌బ్రిటీలు స్పందిస్తే అది కోట్లాది మంది ప్ర‌జ‌ల‌కు చేరుతుంది. ఇంత వ‌ర‌కూ బాల‌ల చిత్రాల‌కు అలాంటి అవ‌కాశ‌మే రాలే



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.