Begin typing your search above and press return to search.

కాంతార హీరో, హీరోయిన్‌ పారితోషికం అంత తక్కువనా?

By:  Tupaki Desk   |   2 Dec 2022 4:26 AM GMT
కాంతార హీరో, హీరోయిన్‌ పారితోషికం అంత తక్కువనా?
X
ప్రస్తుతం ఎక్కడ చూసినా.. విన్నా కాంతార ముచ్చట్లే. కన్నడంలో కేవలం 15 కోట్ల రూపాయల బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకుని ఏకంగా 400 కోట్ల రూపాయల కలెక్షన్స్ ను నమోదు చేసిన విషయం తెల్సిందే. వందల కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన కేజీఎఫ్ 2 రికార్డులను కూడా కాంతార బ్రేక్ చేసింది.

కన్నడంలో ఒక చిన్న సినిమా గా రూపొంది విడుదల అయిన కాంతార తెలుగు.. హిందీ తో పాటు అన్ని భాషల్లో కూడా సాలిడ్ కలెక్షన్స్ ను నమోదు చేసింది. కేజీఎఫ్ 2 రికార్డులను కన్నడంలో వచ్చే సినిమాలు బ్రేక్ చేయడానికి కనీసం పదేళ్ల సమయం పడుతుందని భావించారు. కానీ ఏడాది తిరగకుండానే కాంతార అక్కడ రికార్డులను బ్రేక్‌ చేసి నెం.1 స్థానంలో నిలిచింది.

ఇంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న కాంతార సినిమా యొక్క హీరో హీరోయిన్‌ మరియు ఇతర నటీ నటులు తీసుకున్న పారితోషికం ఎంత అనేది అందరిలో ఆసక్తి ని రేకెత్తిస్తోంది. రెండు వందల కోట్ల బడ్జెట్‌ సినిమాలో వంద కోట్లకు పైగా హీరో పారితోషికం గా ఉంటుంది. మరి 400 కోట్ల వసూళ్లు రాబట్టిన రిషబ్‌ షెట్టి రెమ్యూనరేషన్ ఎంత అయ్యి ఉంటుందని చాలా మంది ఆలోచిస్తున్నారు.

కన్నడ సినీ మీడియా కథనాల అనుసారం రిషబ్ షెట్టి రూ.4 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకున్నాడు. కాంతార సినిమాకు రిషబ్ కేవలం హీరో మాత్రమే కాదు దర్శకుడు మరియు రచయిత కూడా. కేవలం హీరోగా నటిస్తే ఇంకా తక్కువ పారితోషికం ఆయన తీసుకునేవాడేమో. నాలుగు కోట్ల పారితోషికం తీసుకుని నటించి తెరకెక్కించిన కాంతార తో రిషబ్‌ షెట్టి ఏకంగా రూ.400 కోట్ల వసూళ్లు రాబట్టాడు.

ఇక కాంతార సినిమాలో హీరోయిన్‌ పాత్రకు ప్రాముఖ్యత తక్కువే అని చెప్పాలి. ఆమె స్క్రీన్‌ ప్రజెన్స్ కూడా తక్కువే ఉంటుంది. కాంతార లో హీరోయిన్ గా సప్తమి గౌడ నటించింది. ఆమెకు నిర్మాతలు 1.25 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సినిమాలో కీలక పాత్రలో కనిపించిన అచ్యుత్‌ కుమార్‌ కు రూ.75 లక్షల పారితోషికం ను నిర్మాతలు ఇచ్చారట.

ఇంకా నవీన్ డి పాడిల్‌ కి రూ.20 లక్షలు, సుందర పాత్రలో నటించిన దీపక్ రాయ్‌ కి రూ.40 లక్షలు, ప్రమోద్‌ శెట్టి 60 లక్షల రూపాయలు మరియు ఫారెస్ట్‌ ఆఫీసర్ గా అత్యంత కీలక పాత్రలో నటించిన కిషోర్ కు హంబులే వారు కోటి రూపాయల పారితోషికం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కంటెంట్ గొప్పగా ఉంటే నటీ నటుల యొక్క స్టార్‌ డమ్ తో పని లేకుండా వందల కోట్లు రాబట్టుకోవచ్చు అని కాంతార సినిమా నిరూపించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.