Begin typing your search above and press return to search.

రెండో వారం ఏమాత్రం తగ్గని దూకుడు!

By:  Tupaki Desk   |   28 Oct 2022 8:30 AM GMT
రెండో వారం ఏమాత్రం తగ్గని దూకుడు!
X
కాంతార సినిమా సంచలనాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కేవలం కన్నడ భాషలోనే రిలీజైన ఈ సినిమా అక్కడ రికార్డులు సృష్టిస్తుండగా ఆ సినిమాని మిగతా భాషల్లో కూడా రిలీజ్ చేశారు. తెలుగులో కాంతారా దూకుడు కొనసాగుతుంది. రెండు వారాలు అవుతున్నా కాంతారా వసూళ్లు అదరగొడుతున్నాయి.

ఇదే ఫాం ని బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా కొనసాగిస్తుంది కాంతారా మూవీ. రెండో వారం లో కూడా కాంతార వసూళ్లు అదిరిపోతున్నాయి. హిందీ ఆడియన్స్ మరోసారి సౌత్ సినిమా కి బ్రహ్మరథం పడుతున్నారు.

కాంతార సినిమా రెండో గురువారం 2.35 కోట్లు వసూళు చేసింది. బాలీవుడ్ లో కాంతార ఇప్పటివరకు 29.85 కోట్లు కొల్లగొట్టింది. ఓ పక్క బాలీవుడ్ సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర పేలవమైన ప్రదర్శన చూపిస్తుండగా సౌత్ సినిమాలు అక్కడ విజృంభిస్తున్నాయి.

ఇప్పటికే తెలుగు సినిమాలైన పుష్ప, ఆర్.ఆర్.ఆర్, కార్తికేయ 2, KGF, KGF2 వందల కోట్లతో బాలీవుడ్ స్టార్స్ కి కంటి మీద కునుకులేకుండా చేస్తుండగా లేటెస్ట్ గా కన్నడ మూవీ కాంతార కూడా రికార్డులు సృష్టిస్తుంది. అక్కడ ఈమధ్య రిలీజైన డాక్టర్ జి సినిమాని కూడా వెనక్కి నెట్టి కాంతార ముందుకు దూసుకెళ్తుంది.

ఇప్పుడప్పుడే బాలీవుడ్ లో పెద్ద సినిమాలు కూడా ఏమి లేకపోవడం వల్ల కాంతార ఫుల్ రన్ లో బాలీవుడ్ లో రికార్డ్ నెంబర్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన కాంతార సినీమ ప్రేక్షకులనే కాదు సినీ సెలబ్రిటీస్ ని కూడా సంబ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇటీవలే సినిమా చూసిన సూపర్ స్టార్ రజినికాంత్ కూడా ఇదొక మాస్టర్ పీస్ అని అన్నారు.

కావాలని పాన్ ఇండియా సినిమా తీయడం కాదు కంటెంట్ ఉంటే అదే పాన్ ఇండియా సినిమా అవుతుందని మరొక్కసారి కాంతార సినిమాతో ప్రూవ్ అయ్యింది. తెలుగులో కూడా ఇప్పటికే పాతిక కోట్లు పైన కలెక్ట్ చేసిన కాంతార ఇక్కడ కూడా ఫుల్ రన్ లో రికార్డులు సృష్టించేలా ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.