Begin typing your search above and press return to search.
విష్ణు తత్వాన్ని వాడేస్తోన్న కాంతార!
By: Tupaki Desk | 12 Oct 2022 4:30 PM GMTఇటీవలే యంగ్ హీరో నిఖిల్ కార్తియేక-2 తో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. నార్త్ లో అనూహ్య వసూళ్లు చూసి షాక్ అవ్వాల్సిన పరిస్థితి. యూనిట్ సైతం ఈ రేంజ్ సక్సెస్ ని అంచనా వేయలేదు. మిరాకిల్ అంటే ఇలా ఉంటుందా? అని వాళ్లకి అప్పుడే అర్ధమైంది.
అయితే హిందీ బెల్ట్ లో సినిమా సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణంగా సినిమాలో విష్ణుతత్వం అన్న పాయింట్. థ్రిల్లర్ నేపథ్యానికి విష్ణుతత్వాన్ని ముడిపెట్టిన విధానం కన్విన్సింగ్ ఉంది. అందుకే ఇస్కాన్ లాంటి ప్రఖ్యాత దేవాలయాల నుంచి ప్రశంలందుకుంది. అయితే ఇప్పుడిదే విష్ణుతత్వాన్ని కొన్ని సినిమాలు ప్రచారం కోసం వినియోగించుకుంటున్నట్లు కనిపిస్తుంది.
ఇటీవలే కన్నడలో 'కాంతార' అనే సినిమా రిలీజ్ అయి అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. అడవి నేపథ్యంలో సాగే సినిమా పుష్ప రేంజ్ లో ఫేమస్ అయింది. రెండు కథలు కాస్త సమీపంగా ఉండటంతో సినిమాని పుష్పతో పోల్చుతున్నారు. ఆ రకంగా టాలీవుడ్ లోనూ కాంతార బాగా ఫేమస్ అవుతుంది. పైగా ఈ చిత్రాన్ని గీతా ఆర్స్ట్ అధినేత అల్లు అరవింద్ రిలీజ్ చేయడంతో మరింత పబ్లిసిటీ దక్కుతోంది.
బిగ్ స్పాన్ లో నే సినిమా రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. త్వరలో తెలుగు వెర్షన్ రిలీజ్ కి రెడీ అవుతోన్న నేపథ్యంలో కన్నట టీమ్ అరవింద్ తో కలిసి హైదరాబాద్ లో ప్రచారం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పనిలో పనిగా విష్ణు తత్వాన్ని తమ సినిమాకి ముడి పెట్టి ప్రచారం చేస్తున్నారు. విభిన్నమైసన సినిమా కావాలనుకునే వారికి కాంతార కచ్చితంగా నచ్చుతుంది.
సినిమాలో అంతర్లీనంగా విష్ణు తత్వాన్ని పెట్టుకుని కథని నడిపించిన విధానం ఆద్యంతం ఆకట్టుకుంటుందన్నారు. 'కార్తికేయ-2' రిలీజ్ అనంతరం విష్ణు తత్వం గురించి అరవింద్ చేసిన వ్యాఖ్యలు తెలుగు వెర్షన్ సినిమాకి మంచి మైలేజ్ తీసుకొచ్చాయి.
ఆ పాయింట్ కొత్త రకం ఆడియన్స్ ని థియేటర్ కి రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి. మరి ఇప్పుడు అరవింద్ సాబ్ తాజాగా చేసిన వ్యాఖ్యల వెనుక అంతరార్ధం అదేనా? అన్నది ఓ సందేహంగా నెటి జనుల్లో చర్చకొస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.