Begin typing your search above and press return to search.

ముద్దుగుమ్మకి రూ.12 కోట్లు... పెళ్లి ఐనా పెరుగుతూనే ఉంది

By:  Tupaki Desk   |   17 Nov 2022 7:31 AM GMT
ముద్దుగుమ్మకి రూ.12 కోట్లు... పెళ్లి ఐనా పెరుగుతూనే ఉంది
X
బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్‌ హీరోయిన్ గా సుదీర్ఘ కాలంగా కొనసాగుతూ వస్తోంది. దాదాపుగా రెండు దశాబ్దాలుగా ఈ అమ్మడి కెరీర్‌ బాలీవుడ్‌ లో సాగుతోంది. మధ్య లో టాలీవుడ్‌ లో కూడా ఈ అమ్మడు సినిమాలు చేసిన విషయం తెల్సిందే. సాదారణంగా సౌత్‌ హీరోయిన్స్ దశాబ్ద కాలం కంటే ఎక్కువ కెరీర్ ను కొనసాగించలేరు. ఒక వేళ కొనసాగినా కూడా ప్రస్తుతం శ్రియ ఎలా అయితే సినిమాలు చేస్తుందో అలాగే చేసుకోవాల్సి ఉంటుంది.

సౌత్‌ లో పరిస్థితి ఇలా ఉంటే బాలీవుడ్‌ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎంత సీనియర్స్ అయితే అంతగా క్రేజ్ పెరుగుతోంది. కత్రీనా కైఫ్ ఇండస్ట్రీ లో అడుగు పెట్టి ఇరవై ఏళ్లు అయినా కూడా క్రేజ్ తగ్గలేదు.. క్రేజ్ కు తగ్గట్లుగా పారితోషికం ను కూడా అందుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు అందుకున్న పారితోషికం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

బాలీవుడ్‌ లో అతి తక్కువ మంది ముద్దుగుమ్మలు మాత్రమే పది కోట్లు అంతకు మించి పారితోషికం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కత్రీనా కూడా ఆ జాబితాలో చేరి పోయింది. కత్రీనా పెళ్ల చేసుకున్న తర్వాత కూడా క్రేజ్ తగ్గలేదు.

ఏకంగా రూ.12 కోట్ల ను కత్రీనా ఒక్కో సినిమాకు తీసుకుంటుందని సమాచారం అందుతోంది. బాలీవుడ్‌ లో ఈ మధ్య కాలంలో సక్సెస్ లు చాలా తక్కువ అయ్యాయి.

హిందీ సినిమాల యొక్క బడ్జెట్‌ గతంతో పోల్చితే ఈ మధ్య కాలంలో చాలా వరకు తగ్గింది. అయినా కూడా కత్రీనా పారితోషికం చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కత్రీనా యొక్క పారితోషికం గురించి ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.

కత్రీనా కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారు దీపిక పదుకునే మరియు ఆలియా భట్ గా బాలీవుడ్‌ కు చెందిన ఒక ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. ఇటీవల ఒక సినిమాకు ఐశ్వర్య రాయ్ పది కోట్ల రూపాయల పారితోషికం తీసుకుందట. మిగిలిన వారు మూడు నుండి అయిదు ఆరు కోట్ల పారితోషికం తీసుకుంటూ ఉన్నారట



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.