Begin typing your search above and press return to search.
500 మందితో 'లియో'.. ఎముకులు కొరికే చలిలో షూట్!
By: Tupaki Desk | 28 Feb 2023 9:00 PM GMTవిజయ్ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'లియో' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. 'ఖైదీ'..'విక్రమ్' లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత లోకేష్ టేకప్ చేసిన ప్రాజెక్ట్ కావడం సహా అందులోనూ విజయ్ నటించడంతో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్ లోకి విజయ్ ని తీసుకొచ్చి చేస్తోన్న చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కశ్మీర్ లో జరుగుతోంది.
ఈ విషయాన్ని దర్శకుడు మిస్కిన్ రివీల్ చేసి..అక్కడ ఎలాంటి వాతావరణంలో టీమ్ పనిచేస్తుందో చెప్పుకొచ్చారు. ఆయన పాత్రకి సంబంధించి చిత్రీకరణ పూర్తయిన అనంతరం అక్కడి పరిస్థితులు తెలిపారు. ప్రస్తుతం విజయ్..త్రిష..గౌతమ్ మీనన్ తో పాటు దాదాపు 500 మందిపై షూటింగ్ చేస్తున్నారు.
మైనస్ 12 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్ ... ఎముకులు కొరికే చలి అయినా తప్పదు. అన్నింటిని తట్టుకుని నిలబడి టీమ్అంతా ఎంతో కమిట్ మెంట్ తో పని చేస్తుంది అని తెలిపారు.
దీన్ని బట్టి అక్కడి వాతావరణం ఎంత దారుణంగా ఉందో అద్దం పడుతుంది. అందులోనూ దర్శకులు మిస్కిన్..గౌతమ్ లాంటి వాళ్లు కూడా భాగమవ్వడం విశేషం. ఇంత రిస్క్ వాళ్లకి అవసరం లేదు. కానీ ఈ రకంగా కష్టపడుతూ సినిమాపై తముకున్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇందులో విజయ్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.
అన్ని పనులు పూర్తిచేసి అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఇది లోకేష్ యూనివర్శ్ నుంచి వస్తోన్న చిత్రమని ఓవైపు గట్టిగా ప్రచారం సాగుతున్నా... మరోవైపు ఇది పూర్తిగా కొత్త కథ అని వినిపిస్తుంది. దీనిపై లోకేష్ ఇంత వరకూ క్లారిటీ ఇవ్వలేదు.
ఒకవేళ యూనివర్శ్ అయితే ఖైదీ...విక్రమ్ లో పాత్రల పేర్లు తెరపైకి రావాలి. కానీ ఇంత వరకూ అది జరగలేదు. దీంతో లియో లో ఎలాంటి పాత్రలు కనిపిస్తాయి? అన్న ఎగ్టైట్ మెంట్ అభిమానుల్లో కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని సెవెన్ స్ర్కీన్ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.