Begin typing your search above and press return to search.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కు అక్కడా అదే రిజల్ట్?
By: Tupaki Desk | 1 Nov 2022 2:30 AM GMTది గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దాదాపు 30 ఏళ్ల కు పైగా తర డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటు వంటి 'పొన్నియిన్ సెల్వన్' ని తెరపైకి తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేశారు. అయితే బడ్జెట్ కారణాలదృష్ట్యా ఈ మూవీని డబ్బులు పెట్టడానికి ఫైనాన్షియర్ లు సాహసించకపోవడంతో గత కొంత కాలంగా ఈ ప్రాజెక్ట్ నిరవధికంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు లైకా ప్రొడక్షన్స్ వర్గాలు ముందుకు రావడంతో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ఫైనల్‌గా కార్య రూపం దాల్చింది.
చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీని తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేశారు. అయితే తమిళంలో మాత్రమే ఈ మూవీ రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. అక్కడి ప్రేక్షకుల్ని మాత్రమే విశేషంగా ఆకట్టుకుంది. మిగతా భాషలతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఆశించిన విధంగా మేకర్స్ ని ఏ విషయంలోనూ ఈ మూవీ సంతృప్తి పరచలేకపోయింది.
ఇండియాతో పాటు ఓవర్సీస్ లోనూ రికార్డు స్థాయి బిజినెస్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ తెలుగులో మాత్రం పెద్దగా రాణించలేక షాకిచ్చింది. కారణం తమిళ ప్రేక్షకులకు మాత్రమే నచ్చిన కథ కావడం, సినిమా అంతా తమిళ నేటివిటీలోనే సాగడం ఈ సినిమాకు ప్రధాన మైనస్ గా మారింది. అదే కారణంతో ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులు ఈ మూవీని ఓన్ చేసుకోలేకపోయారు. ఇదిలా వుంటే ఈ మూవీ అమె జాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
పే పర్ ప్యూ పంద్దిలో స్ట్రీమింగ్ మొదలైన ఈ మూవీని నవంబర్ 4 నుంచి వీక్షకులు ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా వీక్షించే వీలుని కల్పించారు. అయితే థియేటర్లలో ఎలాంటి ఫలితాన్ని ఈ మూవీ చవిచూసిందో అదే ఫలితాన్ని ఓటీటీలోనూ సొంతం చేసుకుని ఆశ్చర్యపరుస్తోందని తెలుస్తోంది.
థియేటర్లలో తమిళ ప్రేక్షకులు ఈ మూవీని విరగబడి చూశారు. కానీ ఇతర భాషలకు చెందిన ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని చూపించడం లేదట. ఓటీటీలోనూ తమిళ ప్రేక్షకులు చూడాలనుకుంటున్నారే కానీ ఇతర భాషలకు చెందిన వారు ఈ మూవీపై అంతగాఆసక్తిగా లేరని తెలుస్తోంది.
నవంబర్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీ మింగ్ కానున్న ఈ సినిమా కోసం కేవలం తమిళ ప్రేక్షకులే ఎగడబతారా? లేక ఇతర భాషల వాళ్లు కూడా ఆసక్తిని చూపించి ఈ మూవీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అయినా సరికొత్త రికార్డు ను తిరగరాసేలా చేస్తారా అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.