Begin typing your search above and press return to search.
Mega 154 : మెగాస్టార్ - రవితేజ క్యారెక్టర్స్ ఇవేనా?
By: Tupaki Desk | 26 July 2022 12:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' తరువాత మూడు క్రేజీ చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో రెండు రీమేక్ సినిమాలు. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' ఆధారంగా 'గాడ్ ఫాదర్' మూవీ రూపొందుతోంది. దీనికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇక తమిళంలో తల అజిత్ హీరోగా నటించిన సిస్టర్ సెంటిమెంట్ మూవీ 'వేదాళం' ఆధారంగా 'భోళా శంకర్' తెరకెక్కుతోంది. ఈ మూవీకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక బాబి డైరెక్ట్ చేస్తున్న మూడవ సినిమా మాత్రం స్ట్రెయిట్ స్టోరీతో రూపొందుతోంది.
'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిమిస్తున్నారు. రెండు రీమేక్ సినిమాకు మించి ఈ చిత్రానికే భారీ క్రేజ్ ఏర్పడింది. కారణం ఈ మూవీలో చిరుతో కలిసి మాస్ మహారాజా రవితేజ నటిస్తుండటమే. ఈ చిత్రంలోని కీలక పాత్రలో రవితేజ కనిపించబోతున్నారు. ఇందులో ఏ పాత్రలో నటించబోతున్నారు? .. చిరుకు తన పాత్రకున్న సంబంధం ఏంటీ? అన్నది గత కొన్ని రోజులుగా రవితేజ ఫ్యాన్స్ తో పాటు చిరు అభిమానులలో పలు అనుమానాల్ని రేకెత్తిస్తోంది.
ఇటీవలే సెట్ లోకి రవితేజ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మేకర్స్ ఓ వీడియో ద్వారా వెల్లడించారు. చిరు కారవాన్ డోర్ ఓపెన్ చేయగానే చిరు చేయి అందించడం.. రవితేజ కన్ను గీటడం ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి బయటికి వచ్చింది. రవితేజ, మెగాస్టార్ ల పాత్రలు ఎలా వుంటాయి. ఈ ఇద్దరి మధ్య వున్న సంబంధం ఏంటీ అన్నది తాజాగా బయటికి వచ్చింది.
సినిమాలో ఇద్దరు సవతి సోదరులుగా కనిపించబోతున్నారట. ఇద్దరి తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే అని అలా ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ సవతి తమ్ముడిగా కనిపించనున్నాడని తెలిసింది. ఇక ఇద్దరి మధ్య అదిరిపోయే లెవెల్లో హై వోల్టేజ్ ఎపిసోడ్ ని దర్శకుడు బాబి ప్లాన్ చేశాడట. ఇది ఇద్దరి అభిమానులుకు పూనకాలు తెప్పించడం ఖాయం అని చెబుతున్నారు.
గతంలో రవితేజ 'అన్నయ్య' సినిమాలో చిరుకు సోదరుడిగా కనిపించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మళ్లీ ఇన్నేళ్లకు ఇద్దరు కలిసి నటిస్తుండటంతో ఈ మూవీపై ఇద్దరు హీరోల అభిమానులు భారీగా ఎక్స్ పెక్ట్ చేస్తున్నారట.
శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రవితేజకు జోడీగా కేథరిన్ నటిస్తోంది. ఈ ఇద్దరికి ఓ పాప కూడా వుంటుందని, ఇందులో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని, పాత్ర నిడివి దాదాపు 40 నిమిషాల పాటు వుంటుందని చెబుతున్నారు. ఇక ఈ మూవీలోని ఇతర పాత్రల్లో బాబీ సింహా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా ఆర్థర్ ఏ. విల్సన్, ఎడిటింగ్ నిరంజన్ దేవరమానె, సంగీతం దేవిశ్రీప్రసాద్.