Begin typing your search above and press return to search.

RC15 : మోహన్ లాల్ రోల్ లీక్..!

By:  Tupaki Desk   |   19 Dec 2022 8:32 AM GMT
RC15 : మోహన్ లాల్ రోల్ లీక్..!
X
RRR తర్వాత ఆ రేంజ్ కు ఏమాత్రం తగ్గని కాంబినేషన్ సెట్ చేసుకున్నాడు మెగా హీరో రాం చరణ్. శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న చరణ్ సినిమాలో రెండు విభిన్న పాత్రలతో మెప్పిచనున్నాడని తెలుస్తుంది. అందులో ఒకటి విలేజ్ రోల్ కాగా మరొకటి స్టైలిష్ రోల్ అని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ మూవీలో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నారని తెలుస్తుది. మళయాళ స్టార్ మోహన్ లాల్ కూడా ఆర్సీ 15వ సినిమాలో నటిస్తున్నారు.

సినిమాలో ఆయన పాత్ర లీక్ అయ్యింది. శంకర్, చరణ్ కాంబో మూవీలో మోహన్ లాల్ సీఎం గా కనిపించనున్నారు. అలాంటి పాత్రల్లో తన మార్క్ నటనలో మెప్పించడం మోహన్ లాల్ కి బాగా అలవాటు. ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్ర చాలా సర్ ప్రైజింగ్ గా ఉంటుందని తెలుస్తుంది.

మోహన్ లాల్ సినిమాలో ఉన్నాడు అనగానే ఈ ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఆల్రెడీ చరణ్ తో శంకర్ సినిమా అనగానే అంచనాలు ఏర్పడగా సినిమాలో మోహన్ లాల్ కూడా ఉన్నారని చెప్పగానే అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో రామరాజు పాత్రలో చరణ్ తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి శంకర్ సినిమా కోసం డ్యుయల్ రోల్ లో సర్ ప్రైజ్ చేయనున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2023 సమ్మర్ లో పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

చరణ్ సినిమాల లైనప్ అదిరిపోయింది. శంకర్ సినిమా పూర్తి కాగానే మరోసారి సుకుమార్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. దానికన్నా ముందే ఉప్పెన డైరెక్టర్ తో సినిమా ఉంది. ఆ మూవీ కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ ఉంటుంది. RRR తర్వాత చరణ్ దూకుడు చూసి మిగతా స్టార్స్ కూడా షాక్ అవుతున్నారు.

మెగా వారసుడిగా పర్ఫెక్ట్ ఫాం లో ఉన్నాడు మెగా పవర్ స్టార్ రాం చరణ్. శంకర్ సినిమా హిట్ పడితే మాత్రం లెక్క వేరేలా ఉంటుంది. శంకర్, బుచ్చి బాబు, సుకుమార్ ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయాలని ఫిక్స్ అయ్యాడు చరణ్.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.