Begin typing your search above and press return to search.

సౌత్‌ ఇండియాలో తోపు 'బాస్‌' నాగార్జున!

By:  Tupaki Desk   |   29 Aug 2022 4:58 AM GMT
సౌత్‌ ఇండియాలో తోపు బాస్‌ నాగార్జున!
X
ఇండియన్ సినిమాల్లో తెలుగు సినిమా స్పెషల్‌ అనడంలో సందేహం లేదు. బాలీవుడ్ సినిమాలను మించి భారీ ఎత్తున తెలుగు సినిమాలు వసూళ్లు నమోదు చేస్తున్నాయి. హిందీ హీరోలను మించి తెలుగు హీరోల పారితోషికాలు ఉంటున్నాయి.

తమిళ మరియు ఇతర సౌత్‌ భాషల సినిమాలతో పోల్చితే తెలుగు సినిమా ఎన్నో రెట్ల భారీ వసూళ్లను నమోదు చేస్తున్నాయి. తెలుగు సినిమాకి చెందిన హీరోలు మరియు దర్శకులు బాలీవుడ్‌ స్టార్స్ తో పోటీ పడుతున్నారు.

ఈ సమయంలోనే నాగార్జున సౌత్ సినీ ఇండస్ట్రీ బిగ్ బాస్ హోస్ట్‌ లో భారీ పారితోషికం తీసుకునే హోస్ట్ గా నిలిచాడు. సౌత్ లో తెలుగు తో పాటు తమిళం.. కన్నడ.. మలయాళం భాషల్లో కూడా బిగ్ బాస్ స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెల్సిందే. తమిళంలో కమల్‌ హాసన్‌ హోస్ట్ గా చేస్తుండగా మలయాళంలో సూపర్‌ స్టార్‌ మోహన్ లాల్ హోస్టింగ్‌ చేస్తున్నాడు.

కన్నడం లో సందీప్‌ సుదీర్ఘ కాలంగా హోస్ట్‌ గా వ్యవహరిస్తున్నాడు. తెలుగు లో గత నాలుగు సీజన్ లుగా నాగార్జున హోస్ట్ గా చేస్తున్నాడు. సౌత్ బిగ్ బాస్ హోస్ట్ ల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వ్యక్తి గా నాగార్జున నిలిచాడు. మరో వారం రోజుల్లో బిగ్ బాస్‌ సీజన్‌ 6 ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే.

ఆ సీజన్ కి గాను నాగార్జున ఏకంగా 15 కోట్ల పారితోషికం ను తీసుకుంటున్నాడట. వారంలో కేవలం ఒక్క రోజు బిగ్‌ బాస్ కోసం నాగార్జున కేటాయించబోతున్నాడు. తెలుగు బిగ్ బాస్ వీకెండ్‌ ఎపిసోడ్స్‌ అయిన శని మరియు ఆదివారాల కోసం నాగార్జున శని వారం షూటింగ్ లో పాల్గొంటాడు. మొత్తం 15 నుండి 17 వారాల పాటు నాగార్జున వారంకు ఒక ఎపిసోడ్‌ కి హోస్టింగ్ చేయబోతున్నాడు.

కమల్ తో పాటు ఇతర సౌత్ బిగ్ బాస్‌ హోస్ట్‌ లు ఎవరు కూడా ఈ స్థాయి పారితోషికం తీసుకుంటున్న దాఖలాలు లేవు. సౌత్‌ హోస్ట్‌ ల పారితోషికంతో పోల్చితే హిందీ బిగ్‌ బాస్ హోస్ట్‌ రెమ్యూనరేషన్‌ పీక్స్ లో ఉంది. సల్మాన్‌ ఖాన్‌ ఏకంగా 350 కోట్ల రూపాయల పారితోషికంను ఈ సీజన్ కి గాను తీసుకోబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.