Begin typing your search above and press return to search.
'నేషనల్ సినిమా డే' 16న కాదంట!
By: Tupaki Desk | 13 Sep 2022 8:30 AM GMT'నేషనల్ సినిమా డే'ను సెప్టెంబర్ 16న నిర్వహిస్తున్నట్టుగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఈ డేట్ ని తాజాగా మార్చేశారు. ఈ నెల 16న జరగనున్న 'నేషనల్ సినిమా డే'ను 23కు వాయిదా వేసినట్టుగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(MAI) తాజాగా వెల్లడించింది.
సెప్టెంబర్ 23న దేశ వ్యాప్తంగా వున్న పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలీస్, కార్నివాల్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్ , ముక్తా ఏ2, మూవీ టైమ్, వేవ్, ఎం2కె, డిలైట్ తదితర 4 వేల థియేటర్లలో ఈ ఫెస్టివల్ జరగనుంది.
ఈ నలుగువేల థియేటర్లలో ప్రేక్షకులు 'నేషనల్ సినిమా డే' రోజున ప్రతీ సినిమాని రూ. 75 టికెట్ కే వీక్షించవచ్చని తెలిపారు. ముందు సెప్టెంబర్ 16నే 'నేషనల్ సినిమా డే' ని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించాని ప్రకటించింది.
అయిలే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ డేట్ ని పక్కన పెట్టి సెప్టెంబర్ 23న నిర్వహించాలని నిర్ణయించామని తెలియజేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ తాజాగా ఓ ప్రెస్ రీలీజ్ ని కూడా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేయడం విశేషం.
'నేషనల్ సినిమా డే' ని దేశ వ్యాప్తంగా వున్న నాలుగు వేల మల్టీప్లెక్స్ థియేటర్లలోనే నిర్వహిస్తున్నామని, ప్రకటించిన టికెట్ ధర కేవలం మల్టీప్లెక్స్ థియేటర్లలో మాత్రమే అమల్లో వుంటుందని, సింగిల్ స్క్రీన్స్ లో కోట్ చేసిన టికెల్ రేట్ వుండదని, ఈ అవకాశాన్ని ప్రేక్షకులు, సినీ ప్రియులు సద్వినియోగం చేసుకుని నచ్చిన సినిమాలని చూస్తూ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నామని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
సెప్టెంబర్ 23న జరిగే 'నేషనల్ సినిమా డే'లో దేశ వ్యాప్తంగా కొత్త సినిమాలతో పాటు నచ్చిన సినిమాలని వీక్షించవచ్చని తెలుస్తోంది. ఇందు కోసం మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేక ఏర్పాట్లని చేయడం విశేషం. మరి ఈ అవకాశాన్ని ఎంత మంది ప్రేక్షకులు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.