Begin typing your search above and press return to search.

అన్న దిగిండు! గిప్పడి సంది లెక్కలు టక్కర్!

By:  Tupaki Desk   |   8 Dec 2022 12:54 PM GMT
అన్న దిగిండు! గిప్పడి సంది లెక్కలు టక్కర్!
X
న‌ట‌సింహ బాల‌కృష్ణ 108వ సినిమాకి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నేడు లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభ‌మైంది. ఈ పూజా కార్యక్రమంలో అల్లు అరవింద్.. కె రాఘవేంద్రరావు.. మైత్రి నవీన్ తదితరులు పాల్గొన్నారు. దీంతో బాల‌య్య 108వ సినిమా వేట కూడా నేటి నుంచి అధికారికంగా మొద‌లైన‌ట్లే.

అతి త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దీంతో బాల‌య్య‌ని అనీల్ తెర‌పై ఎలా చూపించ‌బోతున్నారు? అన్న ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో అప్పుడే మొద‌లైపోయింది.

కామెడీ ఎంట‌ర్ టైన్ మెంట్ చేసే చిత్రాలు చేసే అనీల్ కి ...బాల‌య్య‌కి లంకె ఎలా కుదిరింది? అన్న‌ది ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ లో చ‌ర్చ‌కు దారి తీస్తున్నా? బాల‌య్య‌ని ఎలా చూపించినా త‌మ అంచ‌నాలు మాత్రం అందుకునేలాగే సినిమా ఉంటుంద‌ని భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా కొద్ది సేప‌టి క్రిత‌మే అభిమానులు అంచ‌నాలు రెట్టింపు చేస్తూ అనీల్ ట్విట‌ర్ వేదిక‌గా ఓ ప్రామిస్ చేసాడు. 'అన్న దిగిండు! గిప్పడి సంది లెక్కలు టక్కర్' అంటూ ఓ పోస్ట్ పెట్టాడు. #NBK108లో మునుపెన్నడూ లేని విధంగా NBKని అందించడానికి సంతోషిస్తున్నాను' అని రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ ఫ్యాన్స్ లో కాక‌లు పుట్టిస్తుంది. అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి. అనీల్ పోస్ట్ ని అభిమానులు ఓప్రామిస్ గా భావిస్తున్నారు.

'అన్న మాటిచ్చాడు..దాన్ని నిల‌బెట్టుకుంటాడు' అంటూ అభిమానులు మ‌రింత ఒత్తిడి పెంచేస్తున్నారు. మ‌రి తెర‌పై ఎలాంటి బాల‌య్య‌ని ఆవిష్క‌రిస్తాడో? చూడాలి. అనీల్ కి ఇంత వ‌ర‌కూ వైఫల్యం లేదు. చేసిన సినిమాల‌న్ని భారీ విజ‌యాలే సాధించాయి.

ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ డైరెక్ట‌ర్ . అవ‌న్నీ చూసే బాల‌య్య అవ‌కాశం క‌ల్పించారు. అనీల్ తో ప‌నిచేయడానికి ఇంకా చాలా మంది స్టార్లు హీరోలు క్యూలో ఉన్నారు. ఇంత‌లో బాల‌య్య లాక్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.