Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కోసం ఆదిత్య కరికాలన్‌ ని ఒప్పించే ప్రయత్నం!

By:  Tupaki Desk   |   3 Oct 2022 7:30 AM GMT
ఎన్టీఆర్ కోసం ఆదిత్య కరికాలన్‌ ని ఒప్పించే ప్రయత్నం!
X
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుత సినిమా ఎన్టీఆర్‌30 ఎప్పుడు మొదలు అవ్వబోతుంది అనే విషయం లో క్లారిటీ లేదు. కానీ ఎన్టీఆర్‌31 విషయంలో రోజుకు ఓ వార్త అన్నట్లుగా వస్తుంది.

ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 31 సినిమా అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఎన్టీఆర్ 31 కోసం భారీ స్టార్‌ కాస్టింగ్‌ ను ప్రశాంత్‌ నీల్‌ సెట్‌ చేస్తున్నాడట.

కేజీఎఫ్ సినిమా తో వెయ్యి కోట్ల క్లబ్‌ లో చేరిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించేందుకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఆసక్తిని కనబర్చుతున్నారు. ఈ సమయంలోనే ప్రశాంత్‌ నీల్ సలార్ సినిమాను ప్రభాస్ తో చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలోనే సలార్‌ సినిమా చిత్రీకరణ ముగించే అవకాశం ఉంది అంటూ సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్‌ 31 సినిమా వచ్చే ఏడాది సమ్మర్ వరకు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024 లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ముందస్తు వ్యూహం లో ఉన్నాడు. తాజాగా ఈ సినిమా కోసం ఆదిత్య కరికాలన్‌ అదేనండి తమిళ హీరో చియాన్‌ విక్రమ్‌ ను ప్రశాంత్‌ నీల్‌ సంప్రదించినట్లుగా సమాచారం అందుతోంది.

తాజాగా ఆదిత్య కరికాలన్ పాత్రలో పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి మెప్పించిన విక్రమ్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన హీరోగా నటించిన పలు సినిమాలు తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

అందుకే ఎన్టీఆర్‌ 31 లో ఆయన్ను నటింపజేయడం వల్ల పాన్‌ ఇండియా అప్పీల్ రావడంతో పాటు తెలుగు ప్రేక్షకులకు ఇబ్బంది ఉండదు అనేది ప్రశాంత్‌ నీల్‌ ఆలోచనగా తెలుస్తోంది. మరి విక్రమ్‌ ఎన్టీఆర్‌ 31 లో నటించేందుకు ఒప్పుకుంటాడా అనేది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.