Begin typing your search above and press return to search.
ఈ సినిమా రీ-రిలీజ్ విషయంలో త్రివిక్రముడే పెద్ద 'స్టార్'..!
By: Tupaki Desk | 3 Nov 2022 11:30 AM GMTటాలీవుడ్ లో ఇప్పుడు రీ-రిలీజులు మరియు స్పెషల్ షోల ట్రెండ్ నడుస్తోంది. గతంలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్స్ అయిన సినిమాలను.. క్లాసిక్స్ గా నిలిచిన చిత్రాలను 4K రెజెల్యూషన్ లో మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తున్నారు. వీటికి అభిమానులు మరియు సినీ ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
తమకు నచ్చిన చిత్రాలను మరోసారి బిగ్ స్క్రీన్ మీద చూస్తూ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పట్లో ఈ సినిమాలను థియేటర్లలో చూడలేకపోయిన ఆడియన్స్.. ఇప్పుడు చూసే అవకాశం రావడంతో ఆ అనుభూతిని ఎక్స్ పీరియన్స్ చేస్తున్నారు.
గత మూడు నెలల్లో తెలుగులో అనేక సినిమాలు రీ-రిలీజ్ కాబడ్డాయి. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా 'పోకిరి' సినిమాని మళ్ళీ విడుదల చేయడంతో మొదలైన ట్రెండ్.. ఇంకా కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ 'జల్సా' - నందమూరి బాలకృష్ణ 'చెన్న కేశవ రెడ్డి' - ప్రభాస్ 'రెబల్' చిత్రాలను రీరిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
'ఒక్కడు' 'తమ్ముడు' 'బిల్లా' వంటి చిత్రాలను కూడా కొన్ని థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. నిర్మాత నట్టి కుమార్ బర్త్ డే సందర్భంగా '3' చిత్రాన్ని మళ్ళీ రిలీజ్ చేస్తే.. మంచి వసూళ్లు వచ్చాయి. దీంతో రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన 'అడివి' సినిమాని కూడా మళ్ళీ థియేటర్లలోకి వదిలారు.
ఇప్పటి వరకూ స్టార్ హీరోల సినిమాలనే రీ-రిలీజ్ చేస్తుండగా.. ఇప్పుడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన సందర్భంగా అతను డైరెక్ట్ చేసిన చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.
నవంబర్ 7న త్రివిక్రమ్ బర్త్ డే కావడంతో.. స్రవంతి మూవీస్ వారు ''నువ్వే నువ్వే'' సినిమాని తెలుగు రాష్ట్రాల్లో రీ-రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 4 నుండి 7వ తేదీ వరకు ఎంపిక చేసిన థియేటర్లలో ఈ చిత్రం ప్రదర్శించబడుతుంది.
నిర్మాత స్రవంతి రవి కిషోర్ మరియు త్రివిక్రమ్ మధ్య చాలా కాలంగా అనుబంధం ఉంది. త్రివిక్రమ్ సక్సెస్ లో స్రవంతి మూవీస్ చాలా కీలక పాత్ర పోషించింది. 'నువ్వే కావాలి' సినిమాతో రైటర్ గా త్రివిక్రమ్ కు పెద్ద బ్రేక్ ఇచ్చిన ఆ సంస్థే.. 'నువ్వే నువ్వే' చిత్రంతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసారు.
తరుణ్ మరియు శ్రియ శరణ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన 'నువ్వే నువ్వే' చిత్రం 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవలే హైదరాబాద్ లో స్పెషల్ షో వేశారు. దీనికి దర్శక నిర్మాతలతో పాటుగా అందుబాటులో ఉన్న టీమ్ అంతా హాజరయ్యారు. ఇప్పుడు త్రివిక్రమ్ బర్త్ డే స్పెషల్ గా అదే చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది.
త్రివిక్రమ్ తన రెండు దశాబ్దాల సినీ కెరీర్ లో మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ - అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు. అయితే ఎన్ని సినిమాలు చేసినా మొదటి సినిమా ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది కనుక.. 'నువ్వే నువ్వే' చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు.
అందులోనూ త్రివిక్రమ్ ప్రస్తుతం టాలీవుడ్ లోని అగ్ర దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నారు. అతని దర్శకత్వ ప్రతిభ ఏంటో తొలిసారిగా చాటిచెప్పింది 'నువ్వే నువ్వే'. ఈ సినిమాలో స్టార్ హీరోలెవరూ లేరు కాబట్టి.. ఇప్పుడు కేవలం త్రివిక్రమ్ పేరే జనాలను థియేటర్లకు రప్పిస్తుంది. ఈ సినిమా రీ రిలీజ్ వరకూ ఆయనే పెద్ద 'స్టార్' అని చెప్పాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.