Begin typing your search above and press return to search.

అదే జ‌రిగితే విశ్వ‌క్ సేన్ ఖాతాలో మ‌రో హిట్ ఖాయం!

By:  Tupaki Desk   |   13 Oct 2022 6:31 AM GMT
అదే జ‌రిగితే విశ్వ‌క్ సేన్ ఖాతాలో మ‌రో హిట్ ఖాయం!
X
మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ 'పాగ‌ల్‌' మూవీ అందించిన షాక్ తో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కే ప్రాధాన్య‌త నిస్తున్నాడు. నీసెంట్ గా విశ్వ‌క్ సేన్ న‌టించిన మూవీ. 'అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం'. డీసెంట్ ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరీగా రూపొందిన ఈ మూవీ విశ్వ‌క్ సేన్ కు మంచి విజ‌యాన్ని అందించింది. అత్యంత త‌క్కువ బ‌డ్జెట్ తో రూపొందిన ఈ ఫ్యామిలీ డ్రామా మంచి విజ‌యాన్ని అందించ‌డ‌మే కాకుండా మేక‌ర్స్ కి లాభాల్ని అందించింది.

అంతే కాకుండా ఓ టీవీ ఛాన‌ల్ డిబేట్ లో జ‌రిగిన వివాదం కూడా ఈ సినిమాకు భ‌లే క‌లిసి వ‌చ్చింది. దీంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో మౌత్ టాక్ స్ప్రెడ్ కావ‌డం.. విశ్వ‌క్ సేన్ వీడియో వైర‌ల్ కావ‌డంతో 'అశోక వ‌నంలో అర్జున క‌ల్యాణం' సోష‌ల్ మీడియాలో భారీ స్థాయిలో ట్రెండ్ అయి సినిమాకు ఊహించ‌ని స్థాయిలో మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యేలా చేసింది. అలాంటి మౌత్ టాక్ కోసం విశ్వ‌క్ సేన్ మ‌రో సినిమా ఎదురుచూస్తోంది.

వివ‌రాల్లోకి వెళితే.. విశ్వ‌క్ సేన్ న‌టించిన లేటెస్ట్ రోమ్ కామ్ 'ఓరి దేవుడా!'. విక్ట‌రీ వెంక‌టేష్ దేవుడిగా న‌టించిన ఈ మూవీని త‌మిళ హిట్ ఫిల్మ్ 'ఓమై క‌డ‌వులే' ఆధారంగా రీమేక్ చేశారు. అశ్వ‌త్ మారిముత్తు ఈ మూవీ ద్వారా తెలుగు తెర‌కు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో పీవీపీ సినిమా నిర్మించిన ఈ మూవీపై ట్రేడ్ వ‌ర్గాల్లో డీసెంట్ టాక్ వుంది. ఇద్ద‌రు ప్రేమికులు పెళ్లి చేసుకుని విడిపోవ‌డం.. ఆ త‌రువాత వారీ జీవితాల్లో మొద‌లైయ్యే ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా ఈ మూవీని తెర‌కెక్కించారు.

క్లైమాక్స్ తో పాటు ప‌లు ఎమోష‌న‌ల్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్ని కంట‌త‌డి పెట్టించ‌డం ఖాయం అని ఇన్ సైడ్ టాక్‌. విక్ట‌రీ వెంక‌టేష్ ఈ ప్రాజెక్ట్ కి యాడ్ అయిన ద‌గ్గ‌రి నుంచే ఈ ప్రాజెక్ట్ పై పాజిటివ్ బ‌జ్ మొద‌లైంది.

అయితే ఈ మూవీకి ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో మౌత్ టాక్ ప్ర‌ధానంగా మారింద‌ని తెలుస్తోంది. వ‌న్స్ మౌత్ టాక్ పాజిటివ్ గా మొద‌లైతే విశ్వ‌క్ సేన్ ఖాతాలో మ‌రో హిట్ ప‌డిన‌ట్టేన‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. విశ్వ‌క్ సేన్ కు జోడీగా ఈ మూవీలో మిథిలా పాల్క‌ర్‌, ఆశా భ‌ట్ న‌టించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.