Begin typing your search above and press return to search.

బాలయ్య 'సర్కారు వారి పాట' మరో అడుగు పడిందా?

By:  Tupaki Desk   |   19 Dec 2022 11:30 AM GMT
బాలయ్య సర్కారు వారి పాట మరో అడుగు పడిందా?
X
నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు కమిట్‌ అవుతున్నాడు. సాధారణంగానే వరుసగా సినిమాలు చేసే బాలయ్య అఖండ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో స్పీడ్‌ మరింతగా పెంచాడు. ఈ సంక్రాంతికి బాలయ్య నుండి వంద కోట్ల సినిమా వీర సింహారెడ్డి రాబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయం అధికారికంగా కన్ఫర్మ్‌ అయ్యింది.

బాలయ్య వీర సింహారెడ్డి విడుదల కాకుండానే అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమాను మొదలు పెట్టాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది సమ్మర్ వరకే బాలయ్య.. అనిల్‌ రావిపూడి కాంబో సినిమా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా తర్వాత బాలయ్య చేయబోతున్న సినిమా పై కూడా అప్పుడే చర్చ మొదలు అయ్యింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య హీరోగా సర్కారు వారి పాట సినిమా తో సూపర్‌ హిట్‌ దక్కించుకున్న పరశురామ్‌ ఒక సినిమాను చేయబోతున్నాడు. ఊర్వశివో రాక్షసివో సినిమా ఈవెంట్‌ లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా ఆ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది.

సర్కారు వారి పాట సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న పరశురామ్‌ కథ రెడీ చేసి ఇటీవలే బాలయ్య ను కలిశాడట. కథ బాలయ్యకు బాగా నచ్చిందట. అంతే కాకుండా ఈ సినిమా నిర్మాణం మరియు ఇతర విషయాలు కూడా బాలయ్య కు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయట. అందుకే వెంటనే సినిమాను చేయాలని భావిస్తున్నాడట.

అందుకే పరశురామ్‌ దర్శకత్వంలో బాలయ్య సినిమా కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చకచకా జరుగుతున్నాయట. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఏప్రిల్‌ లేదా మే లో మొదలు అయ్యే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి సినిమా పూర్తి అయినా కాకున్నా వచ్చే ఏడాది సమ్మర్ లోనే సినిమాను మొదలు పెట్టాలని పరశురామ్‌ తో బాలయ్య అన్నాడనే వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి బాలయ్య మరో సినిమా కూడా లైన్ లోకి వచ్చినట్లే అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అభిమానులు ఫుల్‌ హ్యాపీ గా ఉన్నారు. మహేష్ బాబుకు సర్కారు వారి పాట సినిమా తో సూపర్ హిట్‌ ను ఇచ్చిన పరశురామ్‌ కచ్చితంగా బాలయ్య మరో విజయాన్ని అందిస్తాడేమో చూడాలి.   




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.