Begin typing your search above and press return to search.
'పఠాన్' కి UA సర్టిఫికేట్.. ఊప్స్ అన్నీ కట్!
By: Tupaki Desk | 6 Jan 2023 5:54 AM GMTషారూఖ్ ఖాన్ - దీపికా పదుకొనే ప్రధాన తారాగణంగా నటించిన మోస్ట్ అవైటెడ్ 'పఠాన్' సెన్సార్ పూర్తయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సూచించిన కట్ (తొలగింపు) లకు సంబంధించిన అప్ డేట్ తాజాగా వచ్చింది. CBFC సూచనల మేరకు పఠాన్ లో పది ప్రధాన కట్ లు జరిగాయి. అదనంగా మరో మూడు పాక్షిక కట్ లను చేశారని సమాచారం. ఈ చిత్రానికి UA సర్టిఫికేట్ దక్కింది. ఇందులో కథానాయిక దీపికా పదుకొనే క్లోజప్ షాట్ లను తొలగించడంతో పాటు డైలాగ్ లలో కొన్ని మార్పులు చేశారు.
బేషరమ్ రంగ్ అనే వివాదాస్పద పాటకు కనీసం మూడు మార్పులు చేయాలని సీబీఎఫ్ సి కోరింది. ''బహుత్ తాంగ్ కియా... సాహిత్యం సమయంలో పిరుదులు.. సైడ్-పోజ్ లు మతిచెడే ఊప్స్ డ్యాన్స్ మూమెంట్ ల క్లోజప్ షాట్ లను తొలగించాలని సూచించారు. CBFC సూచించిన కత్తిరింపుల వివరాలను మరింత లోతుగా పరిశీలిస్తే.. ఇప్పటికే చెలరేగిన వివాదాలు.. నిరసనలకు చెక్ పెట్టేందుకు కుంకుమపువ్వు లేదా కాషాయ రంగు వస్త్రాన్ని తొలగించారా లేదా మార్చారా అనే విషయాన్ని సర్టిఫికెట్ లో పేర్కొనలేదని ఒక మీడియా కథనం పేర్కొంది.
RAW అనే పదం స్థానంలో 'హమారే' అని 'లాంగ్డే లుల్లే'ని తొలగించి 'టూటే ఫుట్'తో భర్తీ చేశారు. PMO అనే పదం తొలగించారు. PM పదం స్థానంలో 13 వేర్వేరు చోట్ల రాష్ట్రపతి లేదా మంత్రి అని పదాలను చేర్చారు. శ్రీమతి భారతమాత అనే పదాన్ని 'హమారీ భరతమాత'గా... 'అశోకచక్ర'ను వీర్ పురస్కారంగా మార్చారు. KGB అనే పదం SBUతో భర్తీ చేసారు. ఒక డైలాగ్ లో సోట్చ్ అనే పదాన్ని డ్రింక్ గా మార్చారు . అలాగే రష్యాకు సంబంధించిన సూచన (ఒక సీన్ లో) కూడా తొలగించారని తెలిసింది.
నిజానికి కొద్ది రోజులుగా పఠాన్ పై వరుస వివాదాలు ముసురుకోవడం టీమ్ ని ఆందోళనకు గురి చేసింది. ఓ వైపు అహ్మదాబాద్ లో ఆందోళనకారులు పఠాన్ పోస్టర్లను చించివేశారు. బజరంగ్ దళ్ గుజరాత్ ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియోలో పఠాన్ తారాగణం పోస్టర్లు - భారీ కటౌట్ లను కూడా చించివేస్తూ ప్రజలు నినాదాలతో హోరెత్తించడం కనిపించింది. అహ్మదాబాద్ లోని వస్త్రాపూర్ లోని ఆల్ఫా వన్ మాల్ లో బజరంగ్ దళ్ సభ్యులు వీరంగం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. పఠాన్ ని నిషేధించాలంటూ ఒక హ్యాష్ ట్యాగ్ కూడా వైరల్ గా మారింది.
ఎట్టకేలకు సెన్సార్ బోర్డు 13 కట్స్ వరకు ఆదేశించిన అనంతరం ఈ చిత్రానికి యూఏ సర్టిఫికెట్ లభించింది. పఠాన్ కట్స్ గురించి తెలిశాక .. 'శ్రీమతి భారతమాత' అనే డైలాగ్ ను ఎందుకు ఉపయోగించారు? అంటూ పలువురు నెటిజనులు సెర్చ్ మొదలు పెట్టారు.
యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహాం విలన్ గా నటిస్తున్నారు. కింగ్ ఖాన్ వర్సెస్ జాన్ ఎపిసోడ్స్ ఆద్యంతం కుర్చీ అంచుమీద కూచోబెట్టే ట్విస్టులతో సాహసవిన్యాసాలతో సాగుతాయని టాక్ వినిపిస్తోంది. వార్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరో భారీ యాక్షన్ చిత్రంతో సత్తా చాటాలని సిద్ధార్థ్ ఉవ్విళ్లూరుతున్నాడు. ప్రతిష్ఠాత్మక యష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.