Begin typing your search above and press return to search.

పఠాన్@5 లక్షలు... బాబోయ్ ఇది మామూలు రికార్డ్‌ కాదు

By:  Tupaki Desk   |   21 Jan 2023 1:53 PM GMT
పఠాన్@5 లక్షలు... బాబోయ్ ఇది మామూలు రికార్డ్‌ కాదు
X
బాలీవుడ్‌ బాద్ షా షారుఖ్ ఖాన్‌ సాలిడ్ కమర్షియల్‌ సక్సెస్‌ ను దక్కించుకుని ఏకంగా దశాబ్దకాలం పూర్తి అయ్యింది అనడంలో సందేహం లేదు. అయినా కూడా ఆయన యొక్క క్రేజ్‌.. స్టార్‌ డమ్ ఏమాత్రం తగ్గలేదు. షారుఖ్ ఖాన్‌ సినిమా వచ్చి దాదాపుగా నాలుగు సంవత్సరాలు అవుతున్నా కూడా ఆయన తాజా చిత్రం పఠాన్‌ కు ఉన్న అంచనాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌ లో సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన అతి పెద్ద యాక్షన్ ఎంటర్‌టైనర్‌ పఠాన్‌ ఈనెల 25వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. షారుఖ్‌ ఖాన్ యొక్క గత సినిమాల ఫలితాలు మరియు ఇతర విషయాల నేపథ్యంలో పఠాన్ యొక్క ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

బాలీవుడ్‌ మరో సూపర్ స్టార్‌ ఆమీర్ ఖాన్‌ నటించిన లాల్‌ సింగ్ చడ్డా సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ విషయంలో దారుణమైన నిరాశను ఎదుర్కొంది. కానీ పఠాన్ మాత్రం విడుదల రోజు వరకు ఏకంగా 5 లక్షల అడ్వాన్స్ బుకింగ్‌ లు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పఠాన్ సినిమా చుట్టూ నెలకొన్న వివాదాలు.. బాయ్‌ కాట్‌ పిలుపు నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ ఆరంభం అవుతాయా అని చాలా మంది అనుమానం వ్యక్తం చేశారు. కానీ ఎప్పుదైతే పఠాన్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్‌ అయ్యాయో కొన్ని గంటల వ్యవధిలోనే రెండు లక్షల టికెట్లు బుక్ అయ్యాయి.

దేశంలో పలు చోట్ల అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం కాకుండానే ఈ స్థాయిలో సంఖ్య పెరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. విడుదలకు మరో మూడు రోజుల సమయం ఉంది. కనుక అప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్‌ టికెట్ల సంఖ్య 5 లక్షలకు చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏ హిందీ సినిమాకు ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్‌ నమోదు అవ్వలేదు.

పఠాన్ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ తోనే దాదాపుగా 20 నుండి 25 కోట్ల రూపాయల వసూళ్లు నమోదు చేయబోతున్నట్లుగా బాక్సాఫీస్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఈ జోరు చూస్తూ ఉంటే మొదటి రోజే సినిమా వంద కోట్ల వసూళ్లు నమోదు చేసినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. పఠాన్ కు కాస్త పాజిటివ్ టాక్‌ వస్తే కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డు నమోదు అవ్వడం ఖాయం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.