Begin typing your search above and press return to search.

పవన్ తో గోపీచంద్ మలినేని సినిమా.. ఇప్పట్లో లేనట్లేనా!

By:  Tupaki Desk   |   22 Jan 2023 7:30 AM GMT
పవన్ తో గోపీచంద్ మలినేని సినిమా.. ఇప్పట్లో లేనట్లేనా!
X
సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి ఎంత బ్లాక్ బస్టర్ అయిందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను గోపీచంద్ మలినేని తెరకెక్కించారు. ఇందులో బాలకృష్ణ యాక్టింగ్ కు ఫ్యాన్స్ మొత్తం ఫిదా అయ్యారు . బాలకృష్ణకు జోడిగా హనీ రోజ్, శృతిహాసన్ నటించారు. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 120 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు తెలుస్తోంది.

తాజా విషయం ఏమిటంటే గోపీచంద్ మలినేని నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలోనే ఒక విషయం బయటకు వచ్చింది. ఆయన నెక్స్ట్ ఫిలిం పవన్ కళ్యాణ్ తో చేస్తున్నారనే వార్తలు అయితే బయటకు వచ్చాయి.

తాజాగా దీనిపై గోపీచంద్ కూడా క్లారిటీ ఇచ్చారు. పవన్ తో సినిమా చేయడంపై ఆయన స్పందించారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాల్సి ఉందని చెప్పుకొచ్చారు. తనకిష్టమైన వారు ఇద్దరు ఉన్నారని.. అందులో ఒకరు బాలయ్య, రెండు పవన్ కళ్యాణ్ అని చెప్పారు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాకంటే తనకి ఇంకా టైం పడుతుందని వెల్లడించారు.

అయితే ఆయనతో చేసే సినిమా ఎలా ఉంటుందని ప్రశ్నకి ఈ డైరెక్టర్ సమాధానం ఇచ్చారు. పవన్ మార్క్, ఫన్ ఉంటూనే మాస్ యాక్షన్ మూవీగా తీస్తానంటూ వెల్లడించారు. అటు మాస్.. ఇటు క్లాసు మిక్స్ చేసి తీస్తాను అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాలా బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు పూర్తి చేయాల్సి ఉంది. దీంతోపాటు హరిశంకర్ తో భగత్ సింగ్ చేయనున్నారు.

అలాగే సుజిత్ తో ఒక సినిమా చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. సుజిత్ రన్ రాజా రన్ మూవీతో ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత ప్రభాస్ తో సాహూ సినిమా తీశాడు. ఈ సినిమాలు పూర్తి చేయాల్సి ఉండగా... గోపీచంద్, పవన్ మూవీ ఇప్పట్లో పట్టలెక్కే అవకాశం లేదనే చెప్పాలి. అందులోను ఏపీ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇవన్నీ పూర్తవ్వాలంటే ఇంకా రెండేళ్ల పడుతుందని చెప్పవచ్చు. అప్పటిదాకా వీరికి కాంబినేషన్లో సినిమా వస్తుందని నమ్మకం అయితే లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.