Begin typing your search above and press return to search.
రత్నం ఇలా.. పవన్ అలా.. ఏం జరుగుతోంది?
By: Tupaki Desk | 24 Aug 2022 7:21 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలపై తన స్ట్రాటజీ ని మార్చుకుంటున్నారా?.. సినిమాల కంటే పాలిటిక్స్ కే అధిక ప్రాధాన్యతనిస్తున్నారా? అంటే తాజాగా పవన్ కల్యాణ్ అన్నమాటలని బట్టి చూస్తే అదే నిజమని స్పష్టమవుతోంది. వివరాల్లోకి వెళితే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' తరువాత సినిమాలకు బ్రేకిచ్చారు. దాదాపు మూడున్నరేళ్ల విరామం తరువాత మళ్లీ 'పింక్' రీమేక్ ఆధారంగా తెరకెక్కిన 'వకీల్ సాబ్'కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
దిల్ రాజు నిర్మించిన ఈ మూవీ భారీ స్థాయిలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత కూడా మలయాళ రీమేక్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' ఆధారంగా రూపొందిన మరో రీమేక్ మూవీ 'భీమ్మానాయక్'తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'వకీల్ సాబ్' అంత కాకపోయినా హిట్ అనిపించుకుంది. దీని తరువాత కూడా మరో రీమేక్ ని పట్టాలెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళంలో సముద్ర ఖని నటించి తెరకెక్కించిన మూవీ 'వినోదాయ సితం'.
ఇదే మూవీని పవన్ జీ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సముద్రఖని డైరెక్షన్ లో రీమేక్ చేయబోతున్నారు. సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో నటించబోతున్నాడు. త్రివిక్రమ్ ఈ మూవీకి స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ సినిమాలకు ముందు ప్రారంభమై ఆగుతూ సాగుతూ 'హరి హర వీరమల్లు' ఊగిసలాడుతోంది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా షూటింగ్ నిలిచిపోయిన ఈ మూవీ గురించి రక రకాల వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో నిర్మాత ఏ.ఎం. రత్నం చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. ఓ టీవీ ఛానల్ లో ముచ్చటించిన ఏ.ఎం.రత్నం 'హరి హర వీరమల్లు'పై ఆసక్తికక వ్యాఖ్యలు చేశారు. సినిమా రిలీజ్ డేట్ ని ఫైనల్ చేసినట్టుగా ప్రకటించారు. వచ్చే ఏడాది అంటే 2023, మార్చి 30న ఈ మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నామని ప్రకటించి షాకిచ్చారు.
అయితే ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ తాజా షెడ్యూల్ ఎప్పుడు మొదలవుతుంది అనే ప్రశ్నకు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకపోవడం గమనార్హం. ఇదిలా వుంటే విజయవాడలో జరిగిన పార్టీ నేతల సమావేశంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కలవరానికి గురిచేస్తున్నాయి.
తాను సినిమాలు చేయనని, అక్టోబర్ నుంచి పాదయాత్రపైనే పూర్తిగా దృష్టి పెడతానని వెల్లడించి షాకిచ్చారు. అక్టోబర్ నుంచి పాదయాత్ర అంటే ఇప్పటికే 'హరి హర వీరమల్లు' షూటింగ్ ప్రారంభించాలి. కానీ అలా జరగలేదు. దీంతో ఈ మూవీ పరిస్థితి ఏంటి? అనే అనుమానాలని ఇండస్ట్రీ వర్గాలు వ్యవక్తం చేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ లో ఈ మూవీ 50 శాతం చిత్రీకరణ పూర్తయింది.