Begin typing your search above and press return to search.
సినిమా ఉందో లేదో క్లారిటీ లేదు.. అప్పుడే పవన్ 'డాన్' అంటున్నారే..!
By: Tupaki Desk | 8 Sep 2022 4:30 AM GMT'వకీల్ సాబ్' తో సినిమాల్లోకి కంబ్యాక్ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వరుసగా ప్రాజెక్ట్స్ సైన్ చేస్తూ వచ్చారు. ఎప్పుడు డేట్స్ ఇస్తారనేది తెలియనప్పటికీ.. అడ్వాన్సులు తీసుకొని సినిమాలు కమిట్ అయ్యారు. ఇప్పటికే ఓకే చేసిన చిత్రాల షూటింగ్స్ ఎప్పటికి పూర్తి చేస్తారనని ఆలోచిస్తుండగా.. ఇప్పుడు కొత్తగా పవన్ మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా సెట్స్ మీద ఉంది. అలానే అధికారికంగా ప్రకటించిన హరీష్ శంకర్ 'భవదీయుడు భగత్ సింగ్' మూవీ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. వీటితోపాటు సముద్రఖని తో 'వినోద సీతమ్' రీమేక్ కి కూడా ఆయన ఆమోదం తెలిపారు. అయితే ఇప్పుడు 'సాహో' ఫేమ్ సుజీత్ తో కలిసి పని చేయడానికి రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది.
పవన్ - సుజీత్ కాంబోలో ఓ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనుందని అంటున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ లో పవన్ కళ్యాణ్ ఒక స్టైలిష్ డాన్ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. సుజీత్ మొదటి సిట్టింగ్ లోనే పవన్ ని ఇంప్రెస్ చేసాడని.. ఇటీవల ఫైనల్ స్క్రిప్ట్ కూడా లాక్ చేయబడిందని నివేదికలు ఉన్నాయి.
డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ప్రకటించబడుతుందని అంటున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. స్క్రిప్ట్‌లో తన ప్రమేయం లేకపోయినా ఈ ప్రాజెక్ట్ ను సెట్ చేయడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలక పాత్ర పోషించాడట.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని.. ప్రధాన నటీనటులు, సాంకేతిక నిపుణులను ఖరారు చేస్తున్నారని నివేదికలు ఉన్నాయి. అంతేకాదు వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతానికైతే ప్రొడక్షన్ హౌసెస్ నుంచి దీనిపై ఎలాంటి హింట్ లేదు. అలాగని ఈ వార్తలను ఖండించనూ లేదు.
కాకపోతే పవన్ కళ్యాణ్ - సుజిత్ కాంబోలో సినిమా వార్తలు పూర్తిగా అవాస్తమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. పవన్ కొత్తగా మరే ప్రాజెక్ట్ కమిట్ అవ్వలేదని అంటున్నారు. ఇప్పటికైతే 'హరి హర వీరమల్లు' షూటింగ్ ను పునఃప్రారంభించాలని భావిస్తున్నారని.. వచ్చే నెల 5 నుంచి చేపట్టబోయే జనసేన బస్సు యాత్ర ని దృష్టిలో పెట్టుకుని డేట్స్ కేటాయిస్తాడని టాక్.
ఇక 'భవదీయుడు' మరియు 'వినోద సీతం' రీమేక్ ప్రాజెక్ట్స్ అనేవి 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికలు - పవన్ కళ్యాణ్ క్రియాశీలక రాజకీయాల మీదే ఆధారపడి ఉంటాయని అభిప్రాయ పడుతున్నారు. సురేందర్ రెడ్డి అయినా సుజీత్ లేదా అనిల్ రావిపూడి అయినా ఇప్పట్లో పవన్ తో సినిమా కష్టమే అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.