Begin typing your search above and press return to search.
కొత్త సినిమాకు శ్రీకారం చుట్టిన 'పెళ్లి చూపులు' మేకర్స్..!
By: Tupaki Desk | 30 July 2022 5:30 AM GMTబిగ్ బెన్ సినిమాస్ పతాకంపై 'పెళ్లి చూపులు' 'డియర్ కామ్రేడ్' 'దొరసాని' వంటి పలు సినిమాల నిర్మాణంలో భాగం పంచుకున్నారు నిర్మాత యష్ రంగినేని. తాజాగా తన బ్యానర్ లో 6వ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు.
'ఓ పిట్టకథ' చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన చెందు ముద్దు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. '30 వెడ్స్ 21' వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న చైతన్య రావ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో లావణ్య హీరోయిన్ గా నటిస్తోంది.
హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో శుక్రవారం (జులై 29) ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు క్లాప్ నివ్వగా.. యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కెమెరా స్విఛ్ ఆన్ చేసారు. అలాగే ఫస్ట్ షాట్ కు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు.
ఈ కార్యక్రమంలో చిత్ర బృందంతో పాటుగా మధుర శ్రీధర్ రెడ్డి - సందీప్ రాజ్ - సాయి రాజేష్ - తమ్మారెడ్డి భరద్వాజ - శరత్ మరార్ - కేవీఆర్ మహేంద్ర - లక్ష్మీ భూపాల్ వంటి పలువురు సినీ ప్రముఖులు అతిథులుగా హాజరై చిత్ర బృందానికి విషెస్ తెలిపారు.
బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ లో రూపొందిన మొదటి సినిమా 'పెళ్లి చూపులు' జూలై 29న విడుదలై మంచి సక్సెస్ అందుకోవడంతో.. సెంటిమెంటుగా అదే రోజున కొత్త చిత్రాన్ని ప్రారంభించినట్లు మేకర్స్ తెలిపారు.
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక కొత్త తరహాలో, ప్రయోగాత్మక పద్ధతిలో ఈ సినిమా మేకింగ్ ఉంటుందని మేకర్స్ తెలిపారు. సరికొత్త కథతో దాదాపు అందరు కొత్తవాళ్ళతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చెప్పారు.
చైతన్య రావ్ - లావణ్య లతో పాటుగా మిహిరా - ఉత్తర - రాఘవ - ఆదిత్య తదితరులు ఇతర పాత్రలు పోషించనున్నారు. ప్రిన్స్ హెన్రీ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తుండగా.. పంకజ్ తొట్టాడ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. డి వెంకట్ ప్రభు ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.
ఆగస్ట్ 1వ తేదీ నుంచి ప్రొడక్షన్ నెం.6 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి.. అమలాపురం - అరకు వంటి ప్రాంతాల్లో దాదాపు నెల రోజులు షూటింగ్ చేస్తామని చిత్ర బృందం తెలిపింది. సెప్టెంబర్ లో కేరళ షెడ్యూల్ పూర్తి చేసి.. అక్టోబర్ కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.