Begin typing your search above and press return to search.
మణీ సర్.. ఇలా అయితే కష్టం సర్!
By: Tupaki Desk | 14 Sep 2022 9:30 AM GMTఏస్ డైరెక్టర్ మణిరత్నం దాదాపు 30 ఏళ్లుగా తన కలల ప్రాజెక్ట్ గా భావించిన 'పొన్నియిన్ సెల్వన్'ని తెరపైకి తీసుకురావాలని విశ్వప్రయాత్నాలు చేశారు. కమల్ - రజనీకాంత్ మొదలుకొని విజయ్, మహేష్ వల వరకు ట్రై చేశారు.
అయితే ఫైనాన్షియర్ లు భారీ బడ్జెట్ ని పెట్టడానికి ధైర్యం చేయకపోవడంతో గత కొన్నేళ్లుగా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా పిలుస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఎట్టకేలకు లైకా ప్రొడక్షన్స్ చేతులు కలపడంతో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చింది.
చియాన్ విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తి, జయం రవి, త్రిష కీలక పాత్రల్లో నటించారు. మద్రాస్ టాకీస్ తో కలిసి లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీని రెండు భాగాలుగా నిర్మించింది. ఏ. ఆర్. రెహమాన్ సంగీతం అందించిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని సెప్టెంబర్ 30న ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. టీజర్, లిరికల్ వీడియోలు రిలీజ్ కావడంతో కోలీవుడ్ లో 'బాహుబలి'ని మించిన సినిమా అంటూ తమిళ తంబీలు ప్రచారం చేసుకోవడం మొదలు పెట్టారు.
తాజాగా సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసింది. దీంతో ఈ మూవీపై అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే తెలుగులో మాత్రం ఈ మూవీకి కావాల్సినంత బజ్ క్రియేట్ కావడం లేదు. ప్రస్తుతం విజువల్ ఎక్సాగవాంజాగా తెరకెక్కుతున్న పీరియాడిక్ సినిమాలకు ప్రేక్షకులు ఎట్రాక్ట్ అవుతున్నారు. అలాంటి సినిమాలకు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు.
ఇదే విషయాన్ని గమనించి ఇంత కాలంగా ఎదురుచూసిన మణిరత్నం తన పంథాకు పూర్తి భిన్నంగా 'పొన్నియిన్ సెల్వన్' ని ఓ విజువల్ వండర్ గా తెరకెక్కించాడు. అయితే ఈ మూవీకి తెలుగులో మాత్రం బజ్ పెద్దగా వినిపించడం లేదు. కోలీవుడ్ లో భారీ హైప్ క్రియేట్ అయిన ఈ సినిమాకు అందులో సగం కూడా తెలుగులో బజ్ క్రియేట్ కాకపోవడం మేకర్స్ ని ఆందోళనకు గురిచేస్తోందట.
ఈ మూవీని తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. తను కూడా ఇదే ఫీలవుతున్నాడట. ఏదైనా కొత్తగా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తే తప్ప తెలుగులో ఈ మూవీకి బజ్ క్రియేట్ చేయడం అసాధ్యం అని భావిస్తున్నాడట. దీంతో చాలా మంది తెలుగు మేకర్స్ తో పాటు మణిరత్నం అభిమానులు మణీ సర్.. ఇలా అయితే తెలుగులో కష్టం సర్! అని కామెంట్ లు చేస్తున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.