Begin typing your search above and press return to search.

ప్రభాస్ సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ స‌ర్ ప్రైజ్ ట్రీట్

By:  Tupaki Desk   |   17 Jan 2023 7:33 AM GMT
ప్రభాస్ సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ స‌ర్ ప్రైజ్ ట్రీట్
X
SPIRIT ప్ర‌భాస్ న‌టిస్తున్న 25వ సినిమా. ఈ సిల్వర్ జూబ్లీ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించ‌నున్నారు. ఈ మైలురాయి చిత్రం టైటిల్ ని గత ఏడాది అక్టోబర్ లో ప్రకటించగానే అద్భుత స్పందన వ‌చ్చింది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ సందీప్ రెడ్డి వంగా భధ్ర‌కాళి ఫిలింస్ సహకారంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

ఈ సంవత్సరం రెండవ భాగంలో సందీప్ తో క‌లిసి 'స్పిరిట్' ప్రీ-ప్రొడక్షన్ ప‌నులను ప్రారంభిస్తామ‌ని భూషణ్ కుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ధృవీకరించారు. రణబీర్ కపూర్ నటించిన బాలీవుడ్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'యానిమల్' విడుదలైన తరువాత ఈ సంబ‌రం మొద‌ల‌వుతుంది.

ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రపై కొనసాగుతున్న ఊహాగానాల‌పై నిర్మాత భూషణ్ కుమార్ వివ‌ర‌ణ ఇచ్చారు. స్పిరిట్ ఒక ప్రత్యేకమైన కాప్ డ్రామా. అందులో ప్రభాస్ ఒక శక్తివంతమైన పోలీసు అధికారిగా కనిపిస్తారని ఆయన అన్నారు. స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరం ముగింపులో ప్రారంభమవుతుంది.

యష్ రాజ్ కి షారూఖ్ లా టీసిరీస్ కి ప్ర‌భాస్?

య‌ష్ రాజ్ ఫిలింస్ లో కింగ్ ఖాన్ షారూఖ్ ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించారు. సంచ‌ల‌నాల 'దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే' మొద‌లు ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్లు ఈ కాంబినేష‌న్ లో వ‌చ్చాయి. ఇప్పుడు అదే తీరుగా టీసిరీస్ సౌత్ సూప‌ర్ స్టార్ ప్ర‌భాస్ తో చేతులు క‌ల‌ప‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. టీసిరీస్ అధినేత భూషణ్ కుమార్ 2023 లో పాన్ ఇండియ‌న్ స్టార్ ప్ర‌భాస్ తో క‌లిసి సంచ‌ల‌నాలు సృష్టించాల‌ని క‌ల‌లు గంటున్నారు. ఓవైపు బాలీవుడ్ స్టార్ల‌తో య‌ష్ రాజ్ ఫిలింస్ భారీ ఫ్లాపులు తీస్తున్న ఇలాంటి వేళ టీసిరీస్ అధినేత తెలివిగా ప్ర‌భాస్ ని త‌న ల‌క్కీ మ‌స్క‌ట్ గా ఎంపిక చేసుకుని పాన్ ఇండియా స్థాయిలో బ్రాండ్ బిల్డ్ చేసుకోవ‌డం ఆస‌క్తిక‌రం.

నేడు టీసిరీస్ భార‌తీయ సినిమా ఖ్యాతిని విస్త‌రిస్తున్న ఒక ప్ర‌త్యేక‌ బ్రాండ్ గా మారింది. ఇలాంటి స‌మయంలో ప్ర‌భాస్ తో స‌ద‌రు సంస్థ ప్ర‌యాణం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. రోహిత్ ధావన్ తో సినిమా మొద‌లు కార్తీక్ ఆర్యన్ నటించిన 'షెహ‌జాదా' ని రిలీజ్ చేస్తున్న టీసిరీస్ అధినేత‌ త‌దుప‌రి ల‌వ్ రంజన్ రోమ్-కామ్ తూ జీతు మై మ‌క‌ర్.. అజయ్ దేవ్ గన్ భోలా... ప్రభాస్ అదిపురుష్‌..ర‌ణ‌బీర్ కపూర్- యానిమ‌ల్ చిత్రాల‌ను నిర్మిస్తున్నారు.

టీసిరీస్ లో గ్యాంగ్ స్టర్ డ్రామా యానిమ‌ల్ ప్ర‌త్యేక‌మైన సినిమా. సందీప్ వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియెన్ లో బలమైన భావోద్వేగాల‌ను ర‌గిలిస్తుంది. అనీల్ కపూర్ - రణబీర్ కపూర్ తండ్రి- కొడుకుల అనుబంధం ఘ‌ర్ష‌ణ‌ గురించిన సినిమా ఇది. తండ్రి కొడుకుల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ రిలేష‌న్ షిప్ లోని ఒక స‌రికొత్త‌ డైనమిక్ కోణం మునుపెన్న‌డూ ప్రేక్ష‌కులు చూసి ఉండ‌ర‌ని ధీమాగా తెలిపారు. ఈ కథాంశం ఒక యువ‌కుడు తన తండ్రి కోసం ఏం చేస్తాడు? అనేది తెర‌పై ఆవిష్క‌రిస్తుంది. యానిమ‌ల్ కు యాక్ష‌న్- శృంగారం- ప్రతీకారం- డ్రామా- థ్రిల్ -సంగీతం అనే అంశాలు హైలైట్ గా ఉంటాయి. యానిమల్ బిగ్ పాన్ ఇండియా మూవీ అవుతుందని భూషణ్ నమ్మకంగా ఉన్నారు. ఇది అన్ని భాషలలో విడుదలవుతుంద‌ని అతను ధృవీకరించాడు.

ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రేక్షకుల ద‌రికి తీసుకెళ్లడానికి సరైన వనరులను ఉపయోగించుకోవ‌డంపై స్పష్టంగా ఉన్నామ‌ని దక్షిణాది డ‌బ్బింగ్ ల‌పై ఎక్కువ శ్ర‌ద్ధ పెడ‌తామ‌ని భూష‌ణ్‌ అన్నారు. బ్రహ్మాస్ట్ర ద‌క్షిణాదిన 20 కోట్లు వ‌సూలు చేయడం వారి న‌మ్మ‌కాన్ని మరింత పెంచింది. యానిమ‌ల్ ని తెలుగు- కన్నడ -త‌మిళం ఇతర భాషలలో భారీ విడుదల చేయాలని యోచిస్తున్నామన్నారు. మేము దక్షిణాది నుండి నటులతో కూడా సహకరిస్తాము. మేము ఆ మార్కెట్లలో ఈ చిత్రాన్ని ఒక నిర్దిష్ట మార్గంలో కూడా మార్కెటింగ్ చేస్తాము. ఇది సరైన పాన్ ఇండియా విడుదల అవుతుంద‌ని అన్నారు.

స్పిరిట్ అనేది సందీప్ రెడ్డి వంగా శైలిలోని ఒక కాప్ డ్రామా 2023 వేస‌విలో ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. సందీప్ తదుపరి స్పిరిట్ ప‌ని మొద‌లు పెడ‌తాడు. ప్రభాస్ తో భారీ కాప్ యాక్ష‌న్ డ్రామా ఇది. ఈ సంవత్సరం చివరి నాటికి సెట్స్ కెళుతుంద‌ని తెలిపాడు. స్పిరిట్ చాలా ప్రత్యేకమైన చిత్రం. కాప్ డ్రామాల్లో యూనిక్ గా ఉంటుంద‌ని భూష‌ణ్ కుమార్ తెలిపారు. ప్రభాస్ పోలీసు పాత్ర‌లో న‌టించే ఈ చిత్రంలో బలమైన సంగీతం కీల‌క‌ పాత్ర పోషిస్తుంద‌ని తెలిపారు.

భూషణ్ కుమార్ భూల్ భూల‌యా 3ని తెర‌కెక్కించే ఆలోచ‌న‌తోను ప‌ని చేస్తున్నారు. ఈ చిత్రం 2025 లో విడుదల అవుతుందని ధృవీకరించారు. వరుణ్ ధావన్ తో ఒక చిత్రం కోసం తాను చర్చలు జరుపుతున్నానని నిర్మాత భూష‌ణ్ తెలిపారు. ఇప్పటికే జాన్ అబ్రహం తో కొత్త చిత్రం ప్రారంభించాడు.

ల‌వ్ రాంజ‌న్ రొమాంటిక్ కామెడీ కేవ‌లం హాస్యం డ్రామా ప‌రంగానే కాదు.. కుటుంబ ప్రేక్ష‌కుల‌ను అల‌రించే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని భూషణ్ కుమార్ తెలిపారు. మార్చి 2023న ఈ మూవీ విడుద‌ల కానుంది. ఇదే నెల‌ మార్చిలో విడుదలకు సిద్ధ‌మ‌వుతున్న‌ అజయ్ దేవ్‌గన్ భోలాపైనా భూష‌ణ్ న‌మ్మ‌కం వ్య‌క్తం చేసారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.