Begin typing your search above and press return to search.

ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నింటికీ పూర్తి భిన్నం మారుతి మూవీ!

By:  Tupaki Desk   |   17 Jan 2023 10:38 AM GMT
ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నింటికీ పూర్తి భిన్నం మారుతి మూవీ!
X
పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలు అన్నీ పెద్ద బడ్జెట్ సినిమాలే. అన్నీ వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్న సినిమాలే అయినా అనూహ్యంగా ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక చిన్న బడ్జెట్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పడుతున్నారు మేకర్స్.

ఇప్పటివరకు అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేయని ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా అది నిజమో కాదో ఎవరు ఖరారు చేయలేని పరిస్థితి. అయితే టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా పూర్తి చేస్తుంది.

అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే 2023 దసరా కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా మూడో షెడ్యూల్ కూడా ఈ నెల 27 నుంచి స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇప్పటివరకు ప్రభాస్ ఈ సినిమా ఒకే షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ ఫోటోలు కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా పడింది సినిమా యూనిట్. తాజాగా ఉన్న సమాచారం మేరకు ఈ మూడో షెడ్యూల్ ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా చేస్తున్నారని ఈ సీక్వెన్స్ లో మాళవిక మోహనన్ కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో మాళవిక మోహన్ సహా మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. రెండో హీరోయిన్ పేరు నిధి అగర్వాల్ అంటున్నా మూడో హీరోయిన్ గా ఎవరుంటారు అనే విషయం మీద క్లారిటీ లేదు.

హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న కార్తీక్ పలని ఒక అప్డేట్ ఇచ్చారు. విజయ్ వారసుడు సినిమాకి కూడా సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన కార్తీక్ పలని ఆ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ సినిమా గురించి అసలు విషయం బయట పెట్టాడు.

నిజంగానే ప్రచారం జరుగుతున్నట్లుగా ఇది ఒక ఫన్ ఫిలిం అని కార్తీక్ చెప్పుకొచ్చాడు. సినిమా ఏ మాత్రం హెవీగా అనిపించదని ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నింటికీ పూర్తి భిన్నంగా ఉంటుందని కార్తీక్ వాళ్ళని చెప్పుకొచ్చాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.