Begin typing your search above and press return to search.

అవతార్ 2.. పుష్ప రాజ్ హ్యాండ్ ఇచ్చాడుగా!

By:  Tupaki Desk   |   11 Dec 2022 5:30 PM GMT
అవతార్ 2.. పుష్ప రాజ్ హ్యాండ్ ఇచ్చాడుగా!
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మొదటి భాగం వచ్చి దాదాపు ఏడాదికావస్తోంది. కానీ సెకండ్ పార్ట్ షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ కాకపోవడం షాకింగ్. అసలైతే ఇదే నెలలో స్టార్ట్ చేయాలని అనుకున్నారు కానీ మళ్ళీ ఎందుకో వెనుకడుగు వేశారు. అలాగే పుష్ప 2కు సంబంధించిన అప్డేట్ కోసం కూడా ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్యలో అల్లు అర్జున్ అభిమానులు అయితే ఏకంగా గీత ఆర్ట్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే.

వెంటనే పుష్ప 2కు సంబంధించిన అప్డేట్ ఇవ్వాలి అని సోషల్ మీడియాలో కూడా కొన్ని టాక్స్ వైరల్ అయ్యేలా చేశారు. అయితే ఆ విషయంపై గీతా ఆర్ట్స్ పెద్దగా రియాక్ట్ అయితే అవ్వలేదు. కానీ ఒక స్పెషల్ టీజర్ ను మాత్రం విడుదల చేయాలని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేసుకున్నట్లు తెలిసింది. నిజానికి గీతా ఆర్ట్స్ కూడా అందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా రచించింది.

ముఖ్యంగా హాలీవుడ్ మూవీ అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్ సినిమా రిలీజ్ తో పాటు.. థియేటర్లలో పుష్ప టు గ్లిప్స్ కూడా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అందుకు తగ్గట్టుగా ఇప్పుడు గ్లిప్స్ అయితే రెడీ కాలేదు.

ఇటీవల చిత్ర యూనిట్ సభ్యులు పుష్ప మొదటి భాగాన్ని రష్యాలో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ పనుల్లోనే బిజీగా ఉండడం వలన అనుకున్న సమయానికి పుష్ప అప్డేట్ రెడీ చేయలేకపోయారు.

అయితే ముందుగానే గీతా ఆర్ట్స్ మాత్రం ఎగ్జిబిటర్స్ అందరితో ఒక డీల్ అయితే సెట్ చేసుకుంది. కానీ ఇప్పుడు పుష్పా 2 అప్డేట్ లేకపోవడంతో ఆ స్థానంలో అదే సంస్థ నుంచి వస్తున్న 18 పేజెస్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇప్పుడు అవతార్ 2 సినిమా రిలీజ్ రోజు నిఖిల్ సిద్దార్థ్ నటించిన సినిమా ట్రైలర్ కూడా సందడి చేయబోతోంది.

ఇక అనుపమ పరమేశ్వరున్ హీరోయిన్ గా నటిస్తున్న ఆ సినిమాకు సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను డిసెంబర్ 23వ తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. మరి ఈ తరహా ప్రమోషన్స్ తో 18 పెజెస్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.