Begin typing your search above and press return to search.
'పుష్ప 2' కోసం ఎంత మందిని దించేస్తున్నారు?
By: Tupaki Desk | 21 Nov 2022 1:30 PM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ ఊహించని స్థాయిలో దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించడమే కాకుండా ఉత్తరాదిలో రికార్డు స్థాయిలో రూ. 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి సంచలనం సృష్టించింది. ఇది మేకర్స్, హీరో, దర్శకుడు ఊహించలేదు. ఊహించని విధంగా ఈ మూవీ ఉత్తరాదిలో భారీ వసూళ్లని రాబట్టడంతో పార్ట్ 2 విషయంలో దర్శకుడు సుకుమార్, హీరో అల్లు అర్జున్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ కోసం తాజా రిజల్ట్ ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ని రూ. 350 కోట్లకు మించి ఖర్చు చేస్తున్నారట. అంతే కాకుండా పార్ట్ 1కి వచ్చిన రిజల్ట్ ని, క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని 'పుష్ప 2'ని మరిన్ని ప్రత్యేకతలతో ఊహకందని విధంగా భారీ స్థాయిలో తెరపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. చైనా, థాయ్ లాండ్ లలో పలు కీలక ఘట్టాలని చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారని ఇప్పటికే పలు వార్తలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.
థాయ్ లాండ్ లోని దట్టమైన అడవుల్లో అల్లు అర్జున్ పై భారీ స్థాయిలో పులి ఫైట్ ని కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా ఓ వార్త రీసెంట్ గా బయటికి వచ్చిన విషయం తెలిసిందే. అంతే కాకుండా 'పుష్ప 2'పై నెలకొన్న అంచనాల నేపథ్యంలో కాస్టింగ్ విషయంలోనూ సుకుమార్ భారీ మార్పలు చేసున్నట్టుగా తెలుస్తోంది. పార్ట్ 1 లో డాలీ ధనుంజయ, అజయ్ ఘోష్, సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ ప్రధాన విలన్ లుగా కనిపించారు.
అయితే పార్ట్ 2లో మరింత మంది విలన్స్ ని, కొత్త ముఖాలని దించేస్తున్నారట. ఇప్పటికే కీలక లేడీ విలన్ పాత్ర కోసం కేథరిన్ ని, మరో కీలక పాత్రలో బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ని కూడా దర్శకుడు సుకుమార్ ఫైనల్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు బిగ్ బాస్ బ్యూటీ దివిని కూడా ఓ పాత్ర కోసం ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. సినిమాలో ఓ టీవీ ఛానల్ కు సంబంధించి లేడీ జర్నలిస్ట్ పాత్ర వుందట.
దాని కోసం బిగ్బాస్ బ్యూటీ దివిని ఎంపిక చేశారని, ఇప్పటికే తనపై ఓ పాపులర్ లేడీ జర్నలిస్ట్ తో తనకు వర్క్ షాప్ ని నిర్వహించి ఫైనల్ చేశారట. ఇదిలా వుంటే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ విషయంలో అయోమయ స్థితి కొనసాగుతోంది.
రామోజీ ఫిల్మ్ సిటీలో బన్నీ లేకుండానే సుకుమార్ షూటింగ్ మొదలు పెట్టారంటూ వార్తలు వినిపిస్తే మైత్రీ వారు మాత్రం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇంతకీ 'పుష్ప 2' షూట్ మొదలైందా? లఏదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.