Begin typing your search above and press return to search.

పుష్ప 2 తోనైనా ఆ సమస్య తొలగి పోయేనా?

By:  Tupaki Desk   |   12 Oct 2022 2:30 AM GMT
పుష్ప 2 తోనైనా ఆ సమస్య తొలగి పోయేనా?
X
అల్లు అర్జున్‌.. రష్మిక మందన్నా జంటగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కి గత ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం 'పుష్ప'. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమాలోని ఐటెం సాంగ్‌ కి ఏ స్థాయిలో ఆధరణ దక్కిందో మనం చూశాం. దేవి శ్రీ ప్రసాద్‌ ట్యూన్ చేసిన ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ పాటకు సమంత డాన్స్ మరింత హైలైట్‌ గా నిలిచింది.

గత ఏడాది నుండి ఇప్పటి వరకు అదే ఐటం సాంగ్ మాస్ ఆడియన్స్ ను ఊపేస్తోంది. ఇప్పటికి కూడా ఇంకా ఆ పాట గురించే చర్చ జరుగుతుంది అంటే ఏ స్థాయిలో ఆ పాట సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. పుష్ప ఐటం సాంగ్‌ వచ్చిన తర్వాత చాలా ఐటెం సాంగ్స్ వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ఐటం సాంగ్ కూడా కనీసం నోటెడ్‌ కూడా కాలేదు.

దేవి శ్రీ స్వరపర్చిన ఐటెం సాంగ్స్ కూడా వచ్చాయి కానీ అవేవి పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నాయి. ప్రతి ఐటం సాంగ్‌ కి కూడా పుష్ప ఐటం సాంగ్ ను జత కలిపి అబ్బే అంత బాగా లేవు... పుష్ప ఐటం సాంగ్ రేంజ్ లో ఉండాలి అంటూ నిటూర్చుతున్నారు.

దాంతో ఇటీవల వచ్చిన మరియు రాబోతున్న ఐటం సాంగ్స్ కి ఇదో పెద్ద తలనొప్పిగా మారింది అంటూ ఫిల్మ్‌ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

గతంలో కూడా ఒకటి రెండు ఐటెం సాంగ్స్ ఇదే తరహాలో సందడి చేశాయి. చాలా కాలం వరకు వాటి యొక్క ప్రభావం కనపించింది. ఇప్పుడు ఊ అంటావా మావ ఊఊ అంటావా ప్రభావం పుష్ప 2 వచ్చి ఆ ఐటం సాంగ్ తో ఏమైనా తగ్గేనా చూడాలి. పుష్ప 2 ఐటెం సాంగ్ గురించి చాలా ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది.

పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం తమన్నాను సంప్రదించారని.. ఇప్పటికే దేవి శ్రీ అదిరి పోయే ఐటం సాంగ్‌ ను ఇచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఆ పుష్ప 2 ఐటం సాంగ్ తో అయినా సమంత జోరును మరిపించేలా మరో ఐటెం సాంగ్ వస్తుందా అనేది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.