Begin typing your search above and press return to search.

పుష్ప 2 లో మరో లేడీ విలన్‌..!

By:  Tupaki Desk   |   21 Nov 2022 5:50 AM GMT
పుష్ప 2 లో మరో లేడీ విలన్‌..!
X
అల్లు అర్జున్‌.. సుకుమార్ కాంబినేషన్‌ లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకం ను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. పుష్ప దాదాపుగా 400 కోట్ల వసూళ్లు నమోదు చేసిన కారణంగా ఈ సినిమా అంతకు మించి వసూళ్లు సాధించాలని సుకుమార్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు.

పుష్ప 2 సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం విషయం లో సస్పెన్స్ కొనసాగుతోంది. షూటింగ్ ప్రారంభం అయ్యిందని కొందరు.. ఇంకా లేదు అంటూ మరి కొందరు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2 గురించి ఆసక్తికర ప్రచారం ఒకటి సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతున్నాయి.

ఈ సినిమా లో అనసూయ నెగటివ్‌ షేడ్స్ లో కనిపించబోతున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌ లో కూడా అనసూయ కనిపించింది. మంగళం శ్రీను యొక్క భార్య పాత్రలో అనసూయ మెప్పించింది. ఆ పాత్ర రెండవ పార్ట్‌ లో కూడా కంటిన్యూ అవ్వబోతుంది. ఇక మరో లేడీ విలన్ పాత్రను కూడా పుష్ప 2 లో సుకుమార్‌ క్రియేట్‌ చేశాడని సమాచారం అందుతోంది.

ఆ మరో లేడీ విలన్ పాత్రకు గాను కేథరిన్ తెర్సా ను ఎంపిక చేశారని... ఒక పవర్ ఫుల్‌ కాప్‌ కమ్‌ నెగటివ్‌ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో ఆమె ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారట. అల్లు అర్జున్‌ హీరోగా గతంలో నటించిన సినిమాల్లో కేథరిన్ నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా లు హిట్ టాక్ ను దక్కించుకున్నాయి. కనుక బన్నీ ఆ లేడీ విలన్ పాత్రకు కేథరిన్‌ అయితే బాగుంటుందని సూచించి ఉంటాడన్న ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి సినిమా గురించి రకరకాల ప్రచారం అయితే జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు షూటింగ్ కార్యక్రమాల గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం అందడం లేదు. అంతే కాకుండా సినిమా యొక్క విడుదల తేదీ విషయంలో కూడా రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.

కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్‌ అయితే రాలేదు. ఇప్పటి వరకు ఎన్నో పుకార్లు పుష్ప 2 గురించి వచ్చాయి. వాటిల్లో ఏది నిజం ఏది అబద్దం అనేది తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.