Begin typing your search above and press return to search.

పుష్ప 2 కోసం మరో పవర్ఫుల్ విలన్

By:  Tupaki Desk   |   17 Jan 2023 5:55 AM GMT
పుష్ప 2 కోసం మరో పవర్ఫుల్ విలన్
X
2021 చివరలో విడుదలైన పుష్ప సినిమా అల్లు అర్జున్ కు సూపర్ స్టార్ క్రేజ్ తీసుకొచ్చింది. అప్పటి వరకు తెలుగులో స్టైలిష్ స్టార్ గా పిలిపించుకునే అల్లు అర్జున్... పుష్ప దెబ్బకు వచ్చిన క్రేజ్ కి ఐకాన్ స్టార్ గా అప్ గ్రేడ్ అవ్వాలని కూడా నిర్ణయించుకున్నాడు.

సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కేవలం తెలుగులోనే కాదు... తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా సూపర్ హిట్ అయింది. హిందీలో అయితే పెట్టిన దానికి పదింతలు లాభం కూడా తెచ్చి పెట్టింది. ఈ నేపథ్యంలోనే దీనికి కొనసాగింపుగా వచ్చే పుష్ప2 మీద అనేక అంచనాలైతే ఉన్నాయి.

మొదటి భాగంలో ఒక సాధారణ ఎర్రచందనం చెట్లు కొట్టే కూలి ఎర్రచందనం సిండికేట్ డాన్ గా ఎలా ఎదిగాడు అనే అంశాన్ని చూపించగా... ఆ డాన్ గా ఎదిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే విషయాన్ని రెండో భాగంలో చూపిస్తారని ఇప్పటికే దాదాపుగా క్లారిటీ వచ్చేసింది.

మొదటి భాగంలో సునీల్ విలన్ గా కనిపించగా చివరిలో వచ్చిన ఫహద్ ఫాసిల్ రెండో భాగానికి విలన్ ఉన్నట్లుగా అప్పట్లో చెప్పుకొచ్చారు. అయితే ఈ సినిమాకి పాన్ ఇండియా ఇమేజ్ భారీగా ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమా కథను అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ఈ సినిమా కోసం మరో పవర్ఫుల్ విలన్నీ రంగంలోకి దించుతున్నారని అంటున్నారు. ఆయన ఎవరో కాదు లెజెండ్ సినిమాతో ఒక పవర్ఫుల్ విలన్ గా ముద్ర వేయించుకున్న జగపతిబాబు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకులు అందరినీ అలరించిన జగపతిబాబు... లెజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. ఒక క్రేజీ విలన్ అనిపించుకుంటున్నాడు.

అడపా దడపా తండ్రి పాత్రలు, మామ పాత్రలు చేస్తున్నా సరే... విలన్ గా ఆయనను గుర్తింపు వచ్చింది. తమిళ, మలయాళ సినీ పరిశ్రమల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. తమిళ మలయాళ పరిశ్రమల్లో కూడా ఆయనకు మార్కెట్ ఏర్పడిన క్రమంలో ఆయనను ఎందుకు ఒక పవర్ఫుల్ విలన్ గా వాడుకోకూడదు అని భావించిన సుకుమార్... ఈ రెండో భాగంలో ఆయన కోసం ఒక పవర్ఫుల్ పాత్ర సిద్ధం చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. చూడాలి ఇది ఎంతవరకు నిజమవుతుందనేది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.