Begin typing your search above and press return to search.
షెకావత్ x పుష్పరాజ్: రెండు పొట్టేళ్లు గుద్దుకున్నట్లే!
By: Tupaki Desk | 26 July 2022 1:30 AM GMTదిట్టమైన రెండు పొట్టేళ్లు ఢీ కొడితే ఆ సన్నివేశం ఎంత రసవత్తరంగా ఉంటుందో? చెప్పాల్సిన పనిలేదు. అల్లంత దూరాన నుంచి రెండు పొట్టళ్లు పరిగెట్టుకుంటూ వచ్చి ఒకదాన్ని ఒకటి గుద్దుకుంటే? చూసే వాళ్లకి మజా మామూలుగా ఉండదు. నువ్వా? నేనా? అన్న చందంగా రెండు పొట్టేళ్ల మధ్య వార్ ఆసక్తిని పెంచుతుంది. సాధారణంగా ఏ రెండు పొట్టేళ్లు అంత ఈజీగా తలపడవు.
సరిసమానమైన జత కుదిరితేనే ఆ రెండు బరిలోకి దిగుతాయి. ఆ తర్వాత ఎవరిదిరి? ఎంత దమ్మో తెల్చుకుంటాయి. పొట్లేళ్ల మధ్య వార్ అయినా... ఒంగోలు గిత్తలు కాలుదువ్వినా...రెండు తాడిపెద్దుల మధ్య వార్ అయినా సీన్ ఒక్కలాగే ఉంటుంది. మరి ఇలాంటి వార్ కి షెకావత్ సార్-పుష్పరాజ్ రెడీ అవుతున్నారా? ఇద్దరూ పొట్టేళ్ల తరహాలో తలపడబోతున్నారా? ఒంగోలు గిత్తల్లా కాలు దువ్వబోతున్నారా? అంటే అవుననే వినిపిస్తుంది.
'పుష్ప ది రైజింగ్' క్లైమాక్స్ ని ఇద్దరి మధ్య వార్ ఆరంభంతోనే ముగించారు. సిసలైన యుద్దం ఎలా ఉంటుందన్నది? రెండవ భాగం 'పుష్ప దిరూల్' లో ఆవిష్కరించనున్నారు. రెండు పాత్రల మధ్య ఈగో ప్యాక్టరీని సుకుమార్ సెకెండ్ పార్ట్ లో నెక్స్ట్ లెవల్లో హైలైట్ చేయనున్నారు. ఇద్దరు గుడ్డలిప్పి మాట్లాడుకునేలా కథని ఆద్యంతం రక్తికట్టిస్తున్నట్లు తెలుస్తోంది.
కథని ఎంతగా చెక్కితే అంత బెస్ట్ అవుట్ ఫుట్ తీసుకొచ్చే దిశగా సుకుమార్-రైటర్ శ్రీకాంత్ విస్సా పని చేస్తున్నారు. సీన్ పర్పెక్షన్ కోసం ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇంతవరకూ షూటింగ్ ప్రారంభం కాకపోవడానికి ప్రధానం కారణం కూడా అదే. ఈనేపథ్యంలో బన్నీ-ఫహద్ పజల్ పాత్రల మధ్య బలమైన యాక్షన్ సీన్ ఒకటి ఉంటుందిట. ఇద్దరు వ్యక్తిగతంగా తలపడే సన్నివేశం ఒకటి రాస్తున్నారుట.
అది సినిమా మొత్తానికి హైలైట్ గా ఉంటుందని.. ఆ ఒక్క సన్నివేశమే సినిమాని పైకి లేపుతుందని వినిపిస్తుంది. కథ ఎక్కడా డీవియేట్ కాకుండా చక్కని సింక్ తో ఆ సీన్ ఉంటుందని భోగట్టా. సరిగ్గా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చేలా ఆ సీన్ డిజైన్ చేస్తున్నారుట. ఇక్కడే సుకుమార్ రివర్స్ స్ర్కీన్ ప్లే థాట్ ని అప్లే చేస్తున్నారుట.
అప్పటివరకూ పుష్పరాజ్ సిండికేట్ హవా యథేశ్చగా సాగుతుండగా...ఆ ఫైట్ సీన్ ఒక్కసారిగా కథని మలుపు తిప్పేస్తుందని అంటున్నారు. అక్కడ నుంచి రెండు పాత్రలు తిరోగమనంలో సాగుతాయట. ఈ నేపథ్యంలోనే 'పుష్ప-3'కి కూడా ఛాన్స్ ఉండేలా సుకుమార్ సినిమాటిక్ యూనివర్శ్ అనుసరిస్తున్నట్లు లీకులందుతున్నాయి. మరి ఈ యాక్షన్ సీన్లో వాస్తవం ఎంత? 'పుష్ప-3' సంగతి ఏంటి? అన్నది మేకర్స్ డిసైడ్ చేయాల్సి ఉంది.