Begin typing your search above and press return to search.
పుష్ప 2 ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. సైలెంట్ గా కానిచ్చేస్తున్నారా?
By: Tupaki Desk | 31 Oct 2022 5:30 AM GMTఅల్లు అర్జున్.. సుకుమార్ కాంబినేషన్ లో గత ఏడాది చివర్లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకుందో అందరికి తెల్సిందే. ఆ సినిమా సీక్వెల్ గా రాబోతున్న పుష్ప 2 కోసం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.
పుష్ప 2 సినిమా పై ఉన్న అంచనాలను అందుకునేందుకు గాను దర్శకుడు సుకుమార్ కాస్త ఎక్కువ సమయంను తీసుకుంటున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పుష్ప 2 సినిమా ను పట్టాలెక్కించే అవకాశం ఉంది అంటూ వార్తలు వచ్చాయి. కానీ స్క్రిప్ట్ విషయంలో అప్పటి నుండి మార్పులు చేర్పులు చేసుకుంటూనే వచ్చాడు. దాదాపు ఏడాది పాటు స్క్రిప్ట్ వర్క్.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కి సమయం పట్టింది.
అల్లు అర్జున్ కి తగ్గట్లుగా.. పుష్ప విజయాన్ని మ్యాచ్ చేస్తూ ఎట్టకేలకు పుష్ప 2 స్క్రిప్ట్ రెడీ చేయడం జరిగింది. షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతాయా అంటూ ఎదురు చూస్తున్న సమయంలో అనూహ్యంగా వర్క్ మొదలు అయ్యిందని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.
షూటింగ్ కార్యక్రమాలు నవంబర్ మొదటి వారంలో జరుగుతాయని.. అందుకు సంబంధించిన టెస్ట్ షూట్ మరియు టెక్నికల్ వర్క్ గత వారం పది రోజులుగా సాగుతుందని పుష్ప 2 టీమ్ నుండి సమాచారం అందుతోంది. తాజాగా ఈ ఫోటో బయటకు రావడంతో అతి త్వరలోనే పుష్ప 2 షూట్ ప్రారంభం అవుతుందనే నమ్మకంను బన్నీ ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అర్జున్.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెన్ లు కలిసి ఉన్న ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా కొన్ని షాట్స్ ని కూడా చిత్రీకరించారని.. వాటి ఔట్ పుట్ పై బన్నీ మరియు సుకుమార్ చాలా సంతృప్తిగా ఉన్నారంటూ సమాచారం అందుతోంది.
పుష్ప 2 ఆలస్యంగా ప్రారంభం అయినా వచ్చే ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని బన్నీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి సుకుమార్ మనసు లో పుష్ప 2 విడుదల తేదీ గురించి ఏం ఉందో తెలియాలంటే మరి కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.