Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : కొత్త సినిమాలో రష్మిక ఇలా ఉండబోతుందట
By: Tupaki Desk | 5 April 2023 11:18 AM GMTనేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తాజాగా రష్మిక కమిట్ అయిన కొత్త సినిమా కు సంబంధించిన లుక్ ను రివీల్ చేయడం జరిగింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందబోతున్న ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి.
ఇటీవల నితిన్ పుట్టిన రోజు సందర్భంగా ఒక పోస్టర్ విడుదల చేశారు. ఇప్పుడు రష్మిక పుట్టిన రోజు సందర్భంగా పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. చేతులు కట్టుకుని ఉన్న రష్మిక మందన్న ఫొటోను ఇక్కడ చూడవచ్చు. ఇందులో రష్మిక ఎన్నారై అమ్మాయిగా కనిపించబోతుంది.
యూరప్ బ్యాక్ డ్రాప్ తో రూపొందబోతున్న ఈ సినిమా కు సంబంధించిన రష్మిక పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్టైలిష్ లుక్ లో రష్మిక ఈ సినిమా ద్వారా మెప్పించబోతున్నట్లుగా అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు భావిస్తున్నారు. రష్మిక వరుస సినిమాలకు కమిట్ అవుతున్నా కూడా హిట్ కాంబో అయిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
మరో వైపు పుష్ప 2 సినిమా లో రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెల్సిందే. ఇవే కాకుండా మరో రెండు తెలుగు సినిమాలు చేస్తున్న రష్మిక మందన్నా ఇతర భాషల్లో కూడా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. హిందీలో ఈమె చేసిన సినిమాలు నిరాశపరచడంతో కొత్తగా ఆఫర్లు ఇంకా రాలేదు.
హిందీలో త్వరలోనే మరో సినిమాకు రష్మిక కమిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అందుకు సంబంధించిన చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి రష్మిక సౌత్ మరియు నార్త్ లో బిజీ బిజీగా ఉంది. పుష్ప 2 సినిమా హిట్ అయితే మళ్లీ రష్మిక క్రేజ్ భారీగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
నేడు రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ఫ్యాన్స్ తరఫున మా తరపున హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.