Begin typing your search above and press return to search.

మాస్ 'రావణాసుర' దీపావళి స్పెషల్‌ సర్‌ ప్రైజ్‌

By:  Tupaki Desk   |   24 Oct 2022 5:10 AM GMT
మాస్ రావణాసుర దీపావళి స్పెషల్‌ సర్‌ ప్రైజ్‌
X
మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ధమాకా సినిమా అతి త్వరలోనే విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఇక చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'రావణాసుర' సినిమా యొక్క విడుదల తేదీని దీపావళి సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.

సుధీర్‌ వర్మ దర్శకత్వంలో అభిషేక్ నామ నిర్మిస్తున్న రావణాసుర సినిమాలోని రవితేజ మరో లుక్ ను కూడా దీపావళి సందర్బంగా రివీల్‌ చేయడంతో అభిమానులకు సూపర్ సర్‌ ప్రైజ్ అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రావణాసుర సినిమా రవితేజ మార్క్ మాస్ ఎంటర్‌ టైనర్ గా ఉంటుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు.

రవితేజ కి జోడీగా రావణాసుర సినిమాలో ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ముఖ్యంగా జాతిరత్నాలు ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా కి ఇదో మంచి ఛాన్స్ అన్నట్లుగా ఆమెను అభిమానించే వారు మాట్లాడుకుంటున్నారు.

మేఘ ఆకాంక్ష మరియు దక్షా లు కూడా రవితేజ కు జోడీగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకగా ఏప్రిల్‌ 7వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

రవితేజ చేస్తున్న అన్ని సినిమాల్లోకి ఈ సినిమా పై ఒకింత ఎక్కువ ఆసక్తి ఆయన అభిమానుల్లో ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది.

ఈ సినిమాలో రవితేజ లాయర్ గా కనిపించబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతోంది. ఇక అక్కినేని హీరో సుశాంత్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో మరింతగా ఈ సినిమా కి హైప్ ఉంది అనడంలో సందేహం లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.