Begin typing your search above and press return to search.

ఆర్‌సీ15 : ఇంట్రెస్టింగ్ పొలిటికల్‌ అప్డేట్‌

By:  Tupaki Desk   |   18 July 2022 5:30 AM GMT
ఆర్‌సీ15 : ఇంట్రెస్టింగ్ పొలిటికల్‌ అప్డేట్‌
X
రామ్‌ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఒక భారీ చిత్రం రూపొందుతున్న విషయం తెల్సిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే యూనిట్‌ సభ్యులు తెలియజేశారు.

సినిమా షూటింగ్ చకచకా జరుగుతోంది. దాదాపుగా సగానికి పైగానే షూటింగ్ పూర్తి అవ్వగా.. ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయం రెగ్యులర్ గా మీడియాలో సర్క్యూలేట్ అవుతోంది.

సినిమాకు సంబంధించిన చిన్న విషయం కూడా అంచనాలు భారీగా పెంచుతోంది. ఇప్పటికే సినిమా లో చరణ్ డబుల్‌ రోల్ లో కనిపించబోతున్నాడు అనే విషయం ప్రచారం జరుగుతోంది. సినిమాకు సంబంధించిన కథ మరియు నేపథ్యం గురించి కూడా రకరకాలుగా పుకార్లు షికార్లు చేయడం ద్వారా అంచనాలు భారీగా పెరగడం జరిగింది.

తాజాగా ఈ సినిమా లో ఒక ప్రత్యేకమైన పాట ఉంటుంది.. ఆ పాట ప్రస్తుత పొలిటికల్‌ పరిస్థితులపై ఉంటుందట. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు కౌంటర్ అన్నట్లుగా సదరు పాట లో లిరిక్స్ ఉండటం మాత్రమే కాకుండా పిక్చరైజేషన్ కూడా ఉంటుందని కామెంట్స్ వస్తున్నాయి. ఈ ప్రత్యేక పాటలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ ఆడి పాడబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది.

రామ్‌ చరణ్ కు జోడీగా ఈ సినిమా కియారా అద్వానీ నటిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరు గతంలో కలిసి నటించారు. ఆ సినిమా నిరాశ పరిచింది. అయినా కూడా ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. శంకర్ సినిమా అంటే కేవలం తమిళంలో లేదా తెలుగు లో అంచనాలు ఉండటం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు భారీగా ఉంటాయి.

అందుకే ఈ సినిమా ను పాన్ ఇండియా మార్కెట్‌ కు తగ్గట్లుగా సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ లో చరణ్ తో పాటు కీలక నటీ నటులు పాల్గొంటున్నారు. సినిమా యొక్క టైటిల్‌ విషయంలో అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.