Begin typing your search above and press return to search.
RC 16: ఓ ప్లాన్ సెట్టయ్యింది!
By: Tupaki Desk | 21 March 2023 11:00 PM GMTఆర్ఆర్ఆర్, నాటు నాటుకు ఆస్కార్ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా అమెరికన్ టీవీ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ రామ్ చరణ్ గ్లోబల్ ఆడియెన్స్ కు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆయన తీసే సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి సృష్టిస్తాయనడంలో సందేహం లేదు.
ఈ క్రమంలో అప్ కమింగ్ చరణ్ ప్రాజెక్టులపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ RC15 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో RC16 రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చింది.
బుచ్చిబాబు - రామ్ చరణ్ కాంబోలో వస్తున్న RC16 మూవీ ఈ ఏడాది అక్టోబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 2025లో రిలీజ్ కానుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ మూవీపై అటు మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన శ్రీలీల, అలియా భట్ నటించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
నాటు నాటు ఆస్కార్ తర్వాత తొలిసారిగా ఇండియా వచ్చిన రామ్ చరణ్ నేరుగా హైదరాబాద్ కు రాకుండా ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో రామ్ చరణ్ తన అప్ కమింగ్ ప్రాజెక్టులను చెబుతూ RC16 గురించి ఇంట్రెస్ట్ అప్ డేట్ ఇచ్చాడు. RC16 లో తన క్యారెక్టర్ రంగస్థలంలో చిట్టిబాబు తరహాలోనే ఉంటూ అంతకు మించి అన్నట్లుగా ఉంటుందని చెప్పాడు.
ఈ ఏడాది జూన్ వరకు RC15 పూర్తి కానుంది. రెండు నెలల గ్యాప్ తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో వస్తున్న RC15 పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ కు RC15 కూడా హిట్ అయితే బుచ్చిబాబు ప్రాజెక్టుపై విపరీతమైన అంచనాలు నెలకొంటాయి. మరీ వాటిని బుచ్చిబాబు ఏమేరకు మేనేజ్ చేస్తారో చూడాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.