Begin typing your search above and press return to search.
సాయితేజ్ మరొకటి లాక్ చేసాడు..అదెప్పుడో తెలుసా?
By: Tupaki Desk | 5 Dec 2022 10:31 AM GMTఎట్టకేలకు మెగా మేనల్లుడు సాయి తేజ్ కొత్త చిత్రానికి మళ్లీ క్లాప్ పడిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే సినిమా ప్రారంభ మైంది. జయంత్ పానుగంటి అనే కొత్త కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ నిర్మిస్తుంది.
'రిపబ్లిక్' తర్వాత తేజ్ సెట్స్ పైకి తీసుకెళ్లిన చిత్రమిది. ఆ సినిమా రిలీజ్ సమయంలో సాయితేజ్ భారీ యాక్సిడెంట్ కి గురవ్వడం తో కొన్ని నెలలు పాటు విశ్రాంతి లో ఉన్న సంగతి తెలిసిందే.
ఆ సమయంలోనే కొత్త కథలు విని నచ్చిన వాటిని లాక్ చేసి పెట్టాడు. అలా మొదలైన చిత్రమే ఇది. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ హీరో మరో చిత్రాన్ని కూడా ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడైన కార్తీక్ దండు వినిపించిన కథని సాయి ఒకే చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 7వ తేదిన సినిమా గురించి విషయాలు రివీల్ చేయనున్నట్లు సమాచారం.
ఈ సినిమాకి 'విరూపాక్ష' అనే టైటిల్ రిజిస్టర్ చేయించారుట. టైటిల్ ని బట్టి ఇది యూనిక్ స్టోరీలానే అనిపిస్తుంది. మైథాలజీ అచ్ అప్ ఉన్న కథలా తెలుస్తుంది. 'విరుపాక్ష 'అంటే శివుడుకి గల మరొక పేరు. చేతబడి లాంటి బ్లాక్ మ్యాజిక్ కంటెంట్ లా కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో కమర్శియల్ కథలకు ఆథ్యాత్మిక టచ్ అప్ ఇచ్చిన కథలకు ప్రేక్షకులకు బ్రహ్మరధం పడుతోన్న సంగతి తెలిసిందే.
నిఖిల్ హీరోగా నటించిన 'కార్తికేయ-2' జోనర్ అదే. పాన్ ఇండియాలో ఆ సినిమా వందల కోట్లు వసూళ్లని సాధించింది. అలాగే ఈ తరహా జోనర్ వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ దక్కుతోంది. వీటన్నింటిని బేస్ చేసుకునే కార్తీక్ దండు ఈ కథని సిద్దం చేసినట్లు వినిపిస్తుంది. ఈనెల 7న అధికారికంగా టైటిల్ తో పాటు...టీజర్ కూడా చూపించనున్నారుట.
దీంతో సినిమా కాన్సెప్ట్ ఏంటన్నది? ఓ అంచనా వేయోచ్చు. ప్రస్తుతం సాయితేజ్ కొత్త సినిమా షూట్ లో బిజీ కానున్నాడు. ఆ సినిమాతో పాటే కొత్త చ ఇత్రా్ని కూడా ఏక కాలంలో సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడుట. వాటన్నింటిపై మరో రెండు రోజుల్లో క్లారిటీ రానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.