Begin typing your search above and press return to search.
సాయి పల్లవి నెక్స్ట్ ఏంటి..?
By: Tupaki Desk | 29 July 2022 1:30 PM GMTన్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. డాక్టర్ చదివినప్పటికీ నటనను కెరీర్ గా ఎంచుకున్న ఈ ముద్దుగుమ్మ.. 'కస్తూరి మాన్' అనే తమిళ మూవీతో సినీ ప్రస్తానాన్ని ప్రారంభించింది. మలయాళ సూపర్ హిట్ 'ప్రేమమ్'తో యూత్ ను విపరీతంగా ఎట్రాక్ట్ చేసింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా'తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి.. తొలి చిత్రంతోనే ఇక్కడి ప్రేక్షకులను కట్టిపడేసింది.
'భానుమతి ఒక్కటే పీస్.. రెండు కులాలు రెండు మతాలు.. హైబ్రిడ్ పిల్ల' అంటూ ఫిదా లో ఆమె చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఈ మూవీ అనంతరం ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు, కథలను ఎంచుకుంటూ అనతి కాలంలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అలాగే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుని లేడీ పవర్ స్టార్ గా ముద్ర వేయించుకుంది.
కానీ, ఈ మధ్య కాలంలో సాయి పల్లవి టైమ్ అస్సల బాలేదు. గత ఏడాది 'లవ్ స్టోరీ', 'శ్యామ్ సింగరాయ్' చిత్రాలతో రెండు హిట్లను ఖాతాలో వేసుకున్న సాయి పల్లవి.. ఈ ఏడాది ఆ జోరు చూపించలేకపోతోంది.
ఇటీవల ఈమె రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. అందులో ఒకటే 'విరాట పర్వం'. రానా దగ్గుబాటి హీరోగా వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న విప్లవాత్మక ప్రేమ కథా చిత్రమిది.
జూన్ 17న విడుదలైన ఈ చిత్రం.. మంచి టాక్ సొంతం చేసుకుంది. సాయి పల్లవి నటనకు సైతం విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. కానీ, ఈ మూవీ కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే సాయి పల్లవి 'గార్గి'తో వచ్చింది. ఇదో లేడీ ఓరియెంటెడ్ మూవీ కాగా.. దీనికి గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు.
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో జులై 15న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయింది. దీంతో సాయి పల్లవి ఖాతాలో వరసగా రెండు ఫ్లాపులు వచ్చి పడ్డాయి. అయితే ఇప్పుడు సాయి పల్లవి ఏం చేయబోతోంది..? అసలు ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటీ..? అన్న ప్రశ్నలు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
'గార్గి' అనంతరం సాయి పల్లవి నుండి ఒక్క సినిమా అప్డేట్ కూడా రాలేదు. ఆమె కొత్త ప్రాజెక్ట్స్ కు సైన్ చేసిందన్న వార్తలు కూడా వినిపించడం లేదు. అసలు సాయి పల్లవి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి..? ఎవరైనా స్టార్ హీరోతో జతకట్టబోతోందా..? లేక లేడీ ఓరియెంటెడ్ మూవీతో సోలోగా వస్తుందా..? అన్న ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.